Ramayana: రామాయణం వర్సెస్ క్రిస్టోఫర్ నోలన్.. ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్ వైరల్.. గ్రాఫిక్స్‌ను కూడా గుర్తించలేరంటూ..

Ramayana: రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీని క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీతో పోల్చడంపై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తాము గ్రాఫిక్స్ వాడినా.. వాటిని ప్రేక్షకులు గుర్తించలేకపోతే తాము సక్సెస్ సాధించినట్లే అని అన్నాడు.

Published on: Jul 1, 2026, 19:21:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఎపిక్ ఫిల్మ్ 'రామాయణం' (Ramayana) ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రాబోయే సినిమా 'ది ఒడిస్సీ' (The Odyssey) తో వస్తున్న పోలికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాల విజువల్ స్కేల్, బడ్జెట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Ramayana: రామాయణం వర్సెస్ క్రిస్టోఫర్ నోలన్.. ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్ వైరల్.. గ్రాఫిక్స్‌ను కూడా గుర్తించలేరంటూ..
Ramayana: రామాయణం వర్సెస్ క్రిస్టోఫర్ నోలన్.. ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్ వైరల్.. గ్రాఫిక్స్‌ను కూడా గుర్తించలేరంటూ..

పోలికలకు ఇదే కారణం

రామాయణ మూవీని తెరకెక్కిస్తున్న నమిత్ మల్హోత్రా కేవలం ఇండియన్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. ఆస్కార్ విన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'DNEG' (Double Negative) గ్లోబల్ సీఈఓ. క్రిస్టోఫర్ నోలన్ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, టెనెట్, ఓపెన్‌హైమర్ సినిమాలకు వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ (VFX) అందించింది ఈ సంస్థే. ఇప్పుడు ఇదే కంపెనీ రణబీర్ రామాయణానికి కూడా విజువల్స్ హ్యాండిల్ చేస్తుండటంతో ఆటోమేటిక్‌గా హాలీవుడ్ రేంజ్ పోలికలు మొదలయ్యాయి.

థియేటర్లలో ఆడియన్స్‌కు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో తమ ఆలోచన చాలా డిఫరెంట్‌గా ఉంటుందని నమిత్ వివరించారు. వారు వాడిన గ్రాఫిక్స్‌ను థియేటర్లలో చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఏమాత్రం కృత్రిమంగా అనిపించకూడదన్నదే వారి టార్గెట్. విజువల్స్ అంతా నాచురల్‌గా ఉండి ఆడియన్స్ కనిపెట్టలేకపోతే, తమకు అసలైన సక్సెస్ వచ్చినట్లే అని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ముఖ్యంగా నాలుగైదు చోట్ల ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ముందే లీకులు ఇచ్చి ప్రేక్షకులను అలర్ట్ చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కోసం వాడుతున్న టెక్నాలజీ, ఇన్నోవేషన్ గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడదలచుకోలేదన్నారు. ఆడియన్స్ థియేటర్లలో ఆ మ్యాజిక్‌ను నేరుగా అనుభూతి చెందాలని, స్క్రీన్ మీద విజువల్స్ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడతాడని ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తంచేశారు. టెక్నికల్ పరంగా ఇండియన్ సినిమా రేంజ్ మార్చేలా రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.

గ్రాఫిక్స్ క్వాలిటీపై బెట్టింగులు

గ్రీక్ పురాణాల నేపథ్యంలో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న 'ది ఒడిస్సీ' పూర్తిగా ఒక ఫిక్షనల్ స్టోరీ. కానీ మన రామాయణం నిజమైన సంఘటనల ఆధారంగా, కోట్లాది మంది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న కథ.

అందుకే ప్రపంచం ముందు మన సంస్కృతిని అత్యున్నత రీతిలో ప్రెజెంట్ చేసే బాధ్యత మన చేతుల్లోనే ఉందని నమిత్ స్పష్టంచేశారు. రెడిట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ రెండు సినిమాల గ్రాఫిక్స్ క్వాలిటీపై నెటిజన్లు ఇప్పుడే బెట్టింగులు వేసుకుంటున్నారు.

రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇండియన్ స్క్రీన్‌పై బిగ్గెస్ట్ వండర్

దంగల్ లాంటి ఆల్-టైమ్ రికార్డ్ బ్రేకింగ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నితేష్ తివారీ (Nitesh Tiwari) ఈ విజువల్ వండర్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించిన రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సౌత్ లేడీ సెన్సేషన్ సాయి పల్లవి సీతాదేవిగా కనిపిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తూనే, ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్ యాక్షన్ కింగ్ సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల కళ్ళు చెదిరే భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. మొదటి పార్ట్ దీపావళి 2026లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ దీపావళి 2027లో వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More