Christopher Nolan Mumbai Visit: టార్గెట్ ఇండియన్ ఫ్యాన్స్..ముంబైకి క్రిస్టోఫర్ నోలన్.. ఒడిస్సీ ప్రీమియర్ బిజినెస్ ప్లాన్
Christopher Nolan Mumbai Visit: ఆస్కార్ విజేత, లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన 'ది ఒడిస్సీ' గ్రాండ్ ఇండియన్ ప్రీమియర్ కోసం ముంబై రానున్నారు. ఆయనతో పాటు స్పైడర్ మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్, మాట్ డామన్ కూడా భారత్‌లో అడుగుపెడుతుండటంతో గ్లోబల్ బాక్సాఫీస్ మార్కెట్‌లో ఇండియా రేంజ్ ఏంటో తెలుస్తోంది.
Christopher Nolan Mumbai Visit: హాలీవుడ్ సినిమా ప్రమోషన్ల హిస్టరీలోనే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వస్తున్న సరికొత్త విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) గ్లోబల్ ప్రమోషన్ టూర్‌లో భాగంగా భారతదేశంలో గ్రాండ్‌గా ప్రీమియర్ షో జరుపుకోనుంది. లండన్, పారిస్, న్యూయార్క్ లాంటి టాప్ సిటీస్ సరసన ముంబైని అఫీషియల్ గ్లోబల్ టూర్ స్టాప్‌గా యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.

ఇండియాకు నోలన్
ముంబైలోని ‘పీవీఆర్ ఐకాన్ ఐమాక్స్: ఫీనిక్స్ పల్లాడియం’ వేదికగా జరగనున్న ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో పాల్గొనడానికి క్రిస్టోఫర్ నోలన్ ఇండియాకు రానున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్స్ మాట్ డామన్, టామ్ హాలండ్, ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ కూడా భారత్‌కు వస్తున్నారు.
ఇండియా.. గ్లోబల్ హబ్!
చాలా మందికి ఇదొక సాధారణ సెలబ్రిటీ విజిట్‌లా అనిపించవచ్చు. కానీ, హాలీవుడ్ ట్రేడ్ మార్కెట్ పరంగా ఇది ఒక సంచలనం. క్రిస్టోఫర్ నోలన్‌కు ఇండియా కొత్తేమీ కాదు. గతంలో ఆయన ‘టెనెట్’ సినిమా కోసం ముంబైలో కీలక షెడ్యూల్స్ షూట్ చేశారు. అలాగే ఇండియన్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ కోసం కూడా ముంబై వచ్చారు. కానీ ఒక హాలీవుడ్ ఏ-లిస్టర్ మూవీ అఫీషియల్ గ్లోబల్ ప్రీమియర్ కోసం ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి.
బిజినెస్ ప్లాన్
నోలన్ గత చిత్రం ‘ఓపెన్‌హైమర్’ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. అందులో కేవలం ఇండియా నుంచే ఊహించని విధంగా భారీ వసూళ్లు వచ్చాయి. అనేక యూరోపియన్ దేశాల కంటే ఇండియన్ ఐమాక్స్ మార్కెట్ నోలన్ సినిమాలకు హ్యుజ్ రెవెన్యూ జనరేట్ చేస్తోంది. అందుకే హాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు ఇండియాను 'టైర్-1' ప్రమోషన్ జోన్‌గా ట్రీట్ చేస్తున్నారు.
ఐమాక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు
టెక్నికల్ పరంగా నోలన్ ఈ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. 'ది ఒడిస్సీ' సినిమా పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో మాత్రమే రూపొందిన ప్రపంచపు మొట్టమొదటి పూర్తి నిడివి ఫీచర్ ఫిలింగా రికార్డు క్రియేట్ చేసింది.
హోమర్ రాసిన ప్రసిద్ధ పురాతన గ్రీకు పురాణ గాథ ఆధారంగా ఈ మైథికల్ యాక్షన్ ఎపిక్‌ను నోలన్ తెరకెక్కించారు. ట్రాయ్ నగరం పతనం తర్వాత ఒడిస్సియస్ తన స్వగ్రామానికి చేరుకోవడానికి దశాబ్ద కాలం పాటు సముద్ర మార్గంలో చేసిన సుదీర్ఘమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.
ది ఒడిస్సీ రిలీజ్ డేట్
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాట్ డామన్, టామ్ హాలండ్‌తో పాటు అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా వంటి హాలీవుడ్ క్రేజీ తారలు నటించారు. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


