Peddi: పెద్ది ఆట షురూ.. ఏపీలో టికెట్ సేల్ స్టార్ట్.. హాట్ కేకుల్లా ప్రీమియర్ షో టికెట్లు.. తెలంగాణలో సస్పెన్స్

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ ప్రభంజనం మొదలైపోయింది. ఏపీలో ఈ మూవీ టికెట్ సేల్ స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్ షోల టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. హాట్ కేకుల్లా ఈ టికెట్లు అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో మాత్రం టికెట్ అమ్మకాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Published on: Jun 1, 2026, 14:41:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ఆట మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అడ్వాన్స్ టికెట్ సేల్ ఏపీలో స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 2.07 గంటల నుంచి టికెట్ సేల్ స్టార్ట్ అయింది.

ఏపీలో పెద్ది టికెట్ సేల్స్ షురూ
ఏపీలో పెద్ది టికెట్ సేల్స్ షురూ

పెద్ది టికెట్ సేల్

ఏపీలో పెద్ది మూవీ టికెట్ సేల్ స్టార్ట్ అయింది. ప్రముఖ డిజిటల్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ‘డిస్ట్రిక్ట్’, ‘బుక్ మై షో’లో టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీంతో ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షో టికెట్లు సోల్డ్ ఔట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శిస్తారు.

రామ్ చరణ్ క్రేజ్

పెద్ది సినిమాలో గ్రామీణ క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటించనున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో హైప్ ఆకాశానికి తాకిపోయింది. ఇప్పుడు టికెట్ సేల్ చూస్తుంటే రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

ఏపీలో పెద్ది మూవీ ప్రీమియర్ షోలకు అనుమతితో పాటు తొలి వారం రోజల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ల రేటును రూ.600గా నిర్ణయించారు.

తెలంగాణలో సస్పెన్స్

తెలంగాణలో మాత్రం పెద్ది సినిమా టికెట్ సేల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ ఇంకా ప్రీమియర్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు పర్మిషన్ రాకపోవడమే కారణం. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి కల్లా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల అమ్మకాలను పూర్తి స్థాయిలో లైవ్‌లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తెలంగాణలో ప్రత్యేక ప్రీమియర్ షోలపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఈ రోజు రాత్రి లోపు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గ్రాండ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా

శ్రీకాకుళం నేపథ్యంలో, 1980ల కాలం నాటి పల్లెటూరి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గ్రామానికి, సమాజానికి ఎలా గుర్తింపు తెచ్చాడనే భావోద్వేగ భరితమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.

భారీ తారాగణం

ఈ పెద్ది చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

జవాబు: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ప్రశ్న 2: ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

జవాబు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో టికెట్ బుకింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాాయి.

ప్రశ్న 3: తెలంగాణలో 'పెద్ది' ప్రీమియర్ షోల గురించి ఎప్పుడు తెలుస్తుంది?

జవాబు: తెలంగాణ బుకింగ్స్ ఈ రోజు రాత్రి కల్లా ప్రారంభం కానున్నాయి. అలాగే ప్రీమియర్ షోల సమయాలపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More