Peddi: 'పెద్ది'కి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్- ప్రీమియర్ షోలకు పర్మిషన్- టికెట్ రేట్ల పెంపు- షో టైమింగ్స్, రేట్లపై లుక్కేయండి

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. టికెట్ల రేట్ల పెంపునకు, ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టైమింగ్స్, టికెట్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Published on: May 29, 2026, 10:45:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మూవీ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

పెద్ది ప్రీమియర్ షో టికెట్ రేట్లు ఇవే (PTI)
పెద్ది ప్రీమియర్ షో టికెట్ రేట్లు ఇవే (PTI)

పెద్ది ప్రీమియర్ షోలు

మెగా అభిమానులకు, ఎగ్జిబిటర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. పెద్ది సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలతో పాటు, మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పెద్ది మూవీ తొలి వారం షోలకు టికెట్ రేట్లు పెరగనున్నాయి.

టైమింగ్స్ ఇవే

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 'పెద్ది' ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600 గా నిర్ణయించారు. ఇక రెగ్యులర్ రిలీజ్ విషయానికి వస్తే, సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

టికెట్ రేట్లు

రామ్ చరణ్ మూవీ పెద్ది రిలీజ్ తర్వాత తొలి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదు షోలుప్రదర్శించుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు అనుమతి లభించింది.

రూరల్ స్పోర్ట్స్ డ్రామా

పెద్ది మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. వృద్ది సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'చికిరి చికిరి', ‘రయ్ రయ్’తో పాటు అన్ని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ చార్ట్‌లలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాయి. ఈ భారీ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, టిన్నూ ఆనంద్ వంటి వాళ్లు నటించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

సమాధానం: బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' ప్రీమియర్ షోలు ఎప్పుడు మొదలవుతాయి?

సమాధానం: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతుల ప్రకారం జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ ప్రదర్శనలు ప్రారంభమవుతాయి.

ప్రశ్న: 'పెద్ది' ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతగా నిర్ణయించారు?

సమాధానం: జూన్ 3న ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 600 గా నిర్ణయించారు.

ప్రశ్న: థియేటర్లలో రెగ్యులర్ టికెట్ల ధరల పెంపు ఎంతవరకు ఉంది?

సమాధానం: సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More