Ramayana Screening: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) నుంచి ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ 15 నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను చెన్నైలో జరిగిన 'బిగ్ సినీ ఎక్స్‌పో 2026'లో ప్రదర్శించారు. థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రమే చూపించిన ఈ స్పెషల్ క్లిప్‌లో రణబీర్ కపూర్, యశ్ క్యారెక్టర్ల విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' రేంజ్ విఎఫ్ఎక్స్.. మైండ్ బ్లాక్ ఫుటేజ్

చెన్నై వేదికగా జరిగిన ఎగ్జిబిటర్ల సమ్మిట్‌లో ఫోన్లు అస్సలు అనుమతించకుండా అత్యంత కఠినమైన సెక్యూరిటీ మధ్య రామాయణ ఫుటేజ్ ప్రదర్శించారు. ఇందులో వన్-ఐడ్ దైత్య (ఒంటికన్ను రాక్షసుడు), కరడి రూపంలో ఉన్న భయానక జీవులకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ విజువల్స్ చూసిన ప్రముఖ ఎగ్జిబిటర్లు ఈ సినిమా స్కేల్‌ను హాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజ్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' (The Lord of the Rings)తో పోల్చడం విశేషం. ఇప్పటికే లాస్ వేగాస్‌లో జరిగిన 'సినిమాకాన్'లో ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొన్ని సీన్లు ప్రదర్శించి అప్పట్లోనే సంచలనం సృష్టించారు.
రణబీర్, యశ్, సాయి పల్లవి.. నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్
ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తోంది. ఇక కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ లంకేశ్వరుడు రావణాసురుడిగా విలన్ అవతారంలో అలరించబోతున్నారు.
వీరితో పాటు హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్, ఆస్కార్ విన్నింగ్ విఎఫ్‌ఎక్స్ సంస్థ డిఎన్‌ఇజి (DNEG) అధినేత నమిత్ మల్హోత్రా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ మ్యూజిక్ మ్యాజిక్
ఈ రామాయణ సినిమాకు సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) ఇద్దరూ కలిసి ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌కు బీజీఎం, పాటలు అందిస్తున్నారు.
{{/usCountry}}ఈ రామాయణ సినిమాకు సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) ఇద్దరూ కలిసి ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌కు బీజీఎం, పాటలు అందిస్తున్నారు.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. మొదటి భాగం 'రామాయణం పార్ట్ 1' 2026 దీపావళి కానుకగా నవంబర్ 6న వరల్డ్ వైడ్‌గా, నవంబర్ 8న ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించిన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ నటనకు బ్రహ్మరథం పట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో ఈ రెండు భాగాల రామాయణం తెరకెక్కుతోంది.