Ranveer Singh: బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'డాన్' ఫ్రాంచైజీ మూడో భాగం (Don 3) చుట్టూ నడుస్తున్న వివాదం ముదిరి పాకాన పడింది. ఈ చిత్రం నుండి హీరో రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కార్మిక సంఘాన్ని (FWICE) ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో సోమవారం (మే 25) సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశం అనంతరం, రణ్‌వీర్ సింగ్‌తో ఎలాంటి సినిమా ప్రాజెక్టులలోనూ సహకరించవద్దని చిత్ర పరిశ్రమకు FWICE స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది?
గత ఏడాది (2025) డిసెంబర్‌లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించిన తర్వాత.. రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని పట్టుబట్టారట. అయితే దీనికి ఫర్హాన్ అక్తర్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామి రితేష్ సిధ్వానీ అంగీకరించకపోవడంతో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారు.
సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు అప్పటికే ప్రారంభం కావడంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) ద్వారా ఫర్హాన్ FWICE కి ఫిర్యాదు చేశారు. అలాగే రణ్‌వీర్‌పై లీగల్ సూట్ ఫైల్ చేసి రూ. 40 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు.
ఫెడరేషన్ నోటీసులను తిరస్కరించిన రణ్‌వీర్
ఫర్హాన్ ఫిర్యాదుపై విచారణ జరిపిన FWICE.. వివరణ ఇవ్వాల్సిందిగా రణ్‌వీర్ సింగ్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై రణ్‌వీర్ స్పందిస్తూ.. తమ మధ్య ఉన్న ఒప్పందపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఫెడరేషన్ అనేది 'సరైన వేదిక' కాదంటూ కొట్టిపారేశారు.
రణ్‌వీర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ కార్మిక సంఘం అధికారికంగా నోట్ విడుదల చేసింది. "ఫెడరేషన్, ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడి ఉన్న భాగస్వాముల పట్ల రణ్‌వీర్ సింగ్ ప్రదర్శించిన తీరును పరిగణనలోకి తీసుకుని, ఆయనపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ (NCD) జారీ చేయాలని నిర్ణయించాము. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా, ఇలాంటి అన్ ప్రొఫెషనల్ పద్ధతులను నిరుత్సాహపరచడానికి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లు అంతా ఫెడరేషన్‌కు మద్దతుగా నిలవాలని కోరుతున్నాము" అని అందులో పేర్కొంది.
'ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం' - ఫర్హాన్ అక్తర్
{{/usCountry}}రణ్‌వీర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ కార్మిక సంఘం అధికారికంగా నోట్ విడుదల చేసింది. "ఫెడరేషన్, ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడి ఉన్న భాగస్వాముల పట్ల రణ్‌వీర్ సింగ్ ప్రదర్శించిన తీరును పరిగణనలోకి తీసుకుని, ఆయనపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ (NCD) జారీ చేయాలని నిర్ణయించాము. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా, ఇలాంటి అన్ ప్రొఫెషనల్ పద్ధతులను నిరుత్సాహపరచడానికి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లు అంతా ఫెడరేషన్‌కు మద్దతుగా నిలవాలని కోరుతున్నాము" అని అందులో పేర్కొంది.
'ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం' - ఫర్హాన్ అక్తర్
{{/usCountry}}ఈ వివాదంపై ఫర్హాన్ అక్తర్ ఇటీవల 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'తో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. "నేను ఇండస్ట్రీలో నేర్చుకున్నది ఒక్కటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. సినిమా రోల్ పైన పడేవరకు దేనినీ గుడ్డిగా నమ్మలేము. కెరీర్‌లో కొన్నిసార్లు ఇలాంటి సవాలుతో కూడిన రోజులు వస్తాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగాలి. ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు, ఇవన్నీ పక్కన పెట్టి నేను కేవలం నటనపైనే దృష్టి పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అప్పుడైతే ఈ గొడవలన్నీ ఉండవు" అని ఫర్హాన్ పేర్కొన్నారు.
మధ్యలో రణ్‌వీర్ స్థానంలో హృతిక్ రోషన్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే హృతిక్ ఆ వార్తలను ఖండించారు. కాగా ఈ సమస్యను కోర్టుల చుట్టూ తిప్పకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రెండు వర్గాలకు సూచించినప్పటికీ, వివాదం చివరికి నిషేధానికి దారితీసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రణ్‌వీర్ సింగ్‌పై FWICE ఎందుకు నిషేధం విధించింది?
దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం 'డాన్ 3' నుండి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం, ఆ తర్వాత ఫెడరేషన్ ఇచ్చిన నోటీసులను రణ్‌వీర్ తిరస్కరించడంతో ఆయనపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ అయింది.
2. రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' నుండి ఎందుకు తప్పుకున్నారు?
తను నటించిన 'ధురంధర్' సినిమా విజయవంతం కావడంతో, రణ్‌వీర్ 'డాన్ 3' స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని కోరారు. దీనికి మేకర్స్ ఒప్పుకోకపోవడంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.
3. ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్ నుండి ఎంత నష్టపరిహారం కోరుతున్నారు?
సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నిలిచిపోయినందుకు గాను ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్ నుండి రూ. 40 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.