Dhurandhar 2: వర్క్ ఫ్రమ్ థియేటర్.. ధురంధర్ 2 చూస్తూ ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పని.. వీడియో వైరల్.. ఇదేం వింత అంటూ కామెంట్లు

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' థియేటర్లో వింత సంఘటన! సినిమా చూస్తూ ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పని చేస్తున్న ఓ మహిళ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్ల రియాక్షన్ పై ఓ లుక్కేయండి.

Published on: Mar 21, 2026, 20:37:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా మార్చి 19న గ్రాండ్‌గా విడుదలై యాక్షన్ ప్రియులను థ్రిల్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వింత వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

థియేటర్లో ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్న ఓ మహిళ (Instagram/ _khushibatra_)
థియేటర్లో ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్న ఓ మహిళ (Instagram/ _khushibatra_)

థియేటర్‌లో ఆఫీస్ వర్క్

ఖుషి బాత్రా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాత్రి 11 గంటల షోలో ఒక మహిళ.. రణ్‌వీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 చూస్తూనే తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించింది. థియేటర్ అంతా చీకటిగా ఉండటంతో ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్ వెలుగు ఇతర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

కార్పొరేట్ లైఫ్ ఒత్తిడి

ఈ సంఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్తా వర్క్ ఫ్రమ్ థియేటర్ అయిపోయింది" అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ మహిళ పడుతున్న కార్పొరేట్ లైఫ్ ఒత్తిడిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్క్ ప్రెజర్ పై చర్చ

"కనీసం రెండు గంటల పాటు సినిమాను కూడా ప్రశాంతంగా చూడనివ్వడం లేదు. ఇదే అసలైన బర్న్‌అవుట్ అంటే" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో సినిమా చూస్తున్నప్పుడు కూడా పని చేయాల్సి వస్తోందంటే, ఆఫీస్ డెడ్‌లైన్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు.

హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్

ఇక 'ధురంధర్ 2' విషయానికి వస్తే, థియేటర్లలో ఈ మూవీ రచ్చ చేస్తోంది. మొదటి భాగం ధురంధర్ 1 దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్ ధురంధర్ 2 అదరగొడుతోంది. సీక్వెల్‌లో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది.

రణ్‌వీర్ సింగ్ యాక్షన్ హవా

రణ్‌వీర్ సింగ్ తన మార్క్ యాక్షన్‌తో ఈ ధురంధర్ 2 చిత్రంలో అదరగొట్టేశాడు. కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ థియేటర్ ఇన్సిడెంట్ సినిమాకు సోషల్ మీడియాలో భారీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ వైరల్ వీడియోలో మహిళ నిబద్ధత చూసి కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు ఆమె ప్రైవసీ మరియు వినోదాన్ని కోల్పోవడంపై బాధపడుతున్నారు. ఏదేమైనా 'ధురంధర్ 2' షో లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More