Rao Bahadur: చాలా తక్కువ ధరకే టికెట్లు.. రావు బహదూర్ టీమ్ కొత్త ప్లాన్.. ఒక్కో ఏరియాలో ఒక్కోలా.. ఇవే టికెట్ల ధరలు

Rao Bahadur: రావు బహదూర్ మూవీ మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి టికెట్ల రేట్లను అందుబాటు ధరల్లో ఉంచారు. ఏరియాను బట్టి సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో ఒక్కో ధర నిర్ణయించారు. ఆ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Published on: Jul 2, 2026, 17:55:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rao Bahadur: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు కళ్ళు అప్పగించి చూస్తున్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సత్యదేవ్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా (Venkatesh Maha) డైరెక్ట్ చేసిన ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ డ్రామా రేపు (జులై 3) థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది.

Rao Bahadur: చాలా తక్కువ ధరకే టికెట్లు.. రావు బహదూర్ టీమ్ కొత్త ప్లాన్.. ఒక్కో ఏరియాలో ఒక్కోలా.. ఇవే టికెట్ల ధరలు
Rao Bahadur: చాలా తక్కువ ధరకే టికెట్లు.. రావు బహదూర్ టీమ్ కొత్త ప్లాన్.. ఒక్కో ఏరియాలో ఒక్కోలా.. ఇవే టికెట్ల ధరలు

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ ఈ సినిమాను తన జీఎంబీ బ్యానర్‌పై ప్రెజెంట్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో బజ్ మామూలుగా లేదు. దీనికితోడు తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులకు అందుబాటు ధరలో టికెట్లు రేట్లు నిర్ణయించి మేకర్స్ మరో సూపర్ ఎత్తు వేశారు.

మేకర్స్ బంపర్ ఆఫర్

ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి రావు బహదూర్ మేకర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి. కొన్నిభారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని భారీగా పెంచేస్తున్నారు. అంతేకాదు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న ఈ టైమ్‌లో ఆడియన్స్‌ను థియేటర్ల వరకు తీసుకురావడం పెద్ద ఛాలెంజ్.

అందుకే మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఇలాంటి రీజనబుల్ రేట్లతో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మౌత్ టాక్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ భావించారు. అందుకే ఏరియాను బట్టి అందుబాటు ధరలు నిర్ణయించారు.

సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ రేట్లు ఇవే

రావు బహదూర్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన రీజనబుల్ టికెట్ రేట్స్ వివరాలు చూస్తే.. సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే నైజాంలో రూ. 150, ఆంధ్రాలో రూ. 145, సీడెడ్‌లో కేవలం రూ. 100 గా ఫిక్స్ చేశారు. అలాగే మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌కు కూడా భారీ ఊరట ఇచ్చారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 200 గా, ఏపీలో రూ. 177 గా సెట్ చేశారు.

ఈ రేట్లు చూసి సినిమా లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పర్ఫెక్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి క్యూ కట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. దీపా థామస్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ డార్క్ డ్రామాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రేపు థియేటర్లలో సత్యదేవ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సత్యదేవ్.. వెరైటీ కథలతో..

సత్యదేవ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'కృష్ణమ్మ' లాంటి సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇప్పుడు రావు బహదూర్ క్యారెక్టర్‌తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయ్యాడు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే సత్యదేవ్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణం పోసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

డైరెక్టర్ మార్క్..

ఈ సినిమాకి మరో మెయిన్ పిల్లర్ డైరెక్టర్ వెంకటేష్ మహా. 'కేరాఫ్ కంచరపాలెం' లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్‌తో తన మార్క్ చూపించిన మహా, ఈసారి కంప్లీట్ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రేజీ కాంబోను నమ్మి ఏకంగా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

రావు బహదూర్ - టికెట్ రేట్లు ఇలా..

✦ సింగిల్ స్క్రీన్స్ (నైజాం): రూ. 150

✦ సింగిల్ స్క్రీన్స్ (ఆంధ్రా): రూ. 145

✦ సింగిల్ స్క్రీన్స్ (సీడెడ్): రూ. 100

✦ మల్టీప్లెక్స్‌ (తెలంగాణ): రూ. 200

✦ మల్టీప్లెక్స్‌ (ఏపీ): రూ. 177

✦ రిలీజ్ డేట్: జులై 3, 2026

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More