Virosh Wedding: విరోష్ వెడ్డింగ్-అంతా ప్రేమ మయం-స్పెషల్ అట్రాక్షన్ గా రష్మిక, విజయ్ ఫ్లెక్సీ ఫొటోలు-లవ్ జర్నీ తెలిపేలా!

Virosh Wedding: విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు హాట్ టాపిక్. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి ఫిబ్రవరి 26న జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ్ పూర్ లోని హోటల్లో ఏర్పాట్లు చేశారు. అయితే రష్మిక, విజయ్ లవ్ జర్నీ తెలిపేలా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి. 

Published on: Feb 25, 2026, 05:48:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉదయ్ పూర్ లోని మెమెంటోస్ బై ఐటీసీ హోటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడి ఊపందుకుంది. ఈ విరోష్ జంట ఫిబ్రవరి 26న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. ఈ నేపథ్యంలో హోటల్లో విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ప్రత్యేకంగా ఫొటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

విరోష్ ఫొటోలు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. అంతకంటే ముందు ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. మెహందీతో పెళ్లి సందడి మొదలైందని తెలిసింది. ఇక హల్దీ, సంగీత్ కూడా నిర్వహించనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ల కోసం డెకరేషన్ అదరగొట్టారని తెలిసింది. ముఖ్యంగా విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ఉన్న ఫొటో ఫ్లెక్సీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

ఆన్ లైన్ లో లీక్

విరోష్ వెడ్డింగ్ కోసం కట్టుదిట్టమైన సెక్యూరిటీ పెట్టారు. అత్యంత ప్రైవసీ నడుమ వీళ్ల పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలో హోటల్ నుంచి వీడియో ఆన్ లైన్ లో లీక్ కావడం గమనార్హం. రష్మిక, విజయ్ ఫొటో ఫ్లెక్సీల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

తరలివస్తున్న అతిథులు

ఫిబ్రవరి 26న జరిగే విరోష్ వెడ్డింగ్ కోసం సెలబ్రిటీలు ఉదయ్ పూర్ కు తరలి వెళ్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి వెళ్లారు. విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తరుణ్ అందించాడు. తరుణ్, విజయ్ మంచి ఫ్రెండ్స్. అలాగే రష్మిక మందన్న క్లోజ్ ఫ్రెండ్ శ్రావ్య వర్మ, హీరోయిన్ ఆషికా రంగనాథ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు.

విరోష్ లవ్ స్టోరీ

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ జంట 2018లో రిలీజైన గీత గోవిందం సినిమా కోసం తొలిసారి కలిసి యాక్టింగ్ చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ మొదలైందని టాక్. ఆ తర్వాత 2019లో రిలీజైన డియర్ కామ్రేడ్ మూవీ కోసం కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇప్పుడు విరోష్ తమ వెడ్డింగ్ తో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట ప్రస్తుతం రణబాలి సినిమాలోనూ కలిసి నటిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More