రష్మిక తన పెళ్లి డేట్ కన్ఫమ్ చేసినట్లేనా? ఫిబ్రవరి 26 కోసం వెయిటింగ్ అని అంటే ఆమె రియాక్షన్ ఎలా ఉందో చూడండి

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ నెలలోనే ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందని సమాచారం. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఫొటోగ్రాఫర్ పెళ్లి తేదీ గురించి అడగ్గా రష్మిక ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Feb 3, 2026, 18:08:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్న తన పెళ్లి తేదీని పరోక్షంగా కన్ఫమ్ చేసినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న త్వరలో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతేడాది అక్టోబర్ లోనే వీరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని ప్రచారం జరిగినా.. ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న తన హావభావాలతో పెళ్లి వార్తలను పరోక్షంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది.

రష్మిక తన పెళ్లి డేట్ కన్ఫమ్ చేసినట్లేనా? ఫిబ్రవరి 26 కోసం వెయిటింగ్ అని అంటే ఆమె రియాక్షన్ ఎలా ఉందో చూడండి
రష్మిక తన పెళ్లి డేట్ కన్ఫమ్ చేసినట్లేనా? ఫిబ్రవరి 26 కోసం వెయిటింగ్ అని అంటే ఆమె రియాక్షన్ ఎలా ఉందో చూడండి

ఫిబ్రవరి 26న ముహూర్తం?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక పురాతన ప్యాలెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లోని తమ సినీ మిత్రుల కోసం భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

“దేనికి రా?” అంటూ రష్మిక క్యూట్ రియాక్షన్

ఇటీవల రష్మిక మందన్న ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టగా, రష్మిక మాస్క్ తీసి నవ్వుతూ పోజులిచ్చింది. ఈ క్రమంలో ఒక ఫొటోగ్రాఫర్ ఆమెతో మాట్లాడుతూ.. "కంగ్రాచ్యులేషన్స్ మేడమ్" అని చెప్పాడు.

దానికి రష్మిక ఆశ్చర్యంగా, అంతే చనువుగా.. "దేనికి రా?" అని తెలుగులో అడిగింది. వెంటనే ఆ ఫొటోగ్రాఫర్.. "పెళ్లికి మేడమ్.. 26వ తేదీ కోసం వెయిటింగ్" అని అనగానే.. రష్మిక ఆ విషయాన్ని ఖండించలేదు. పైగా సిగ్గుపడుతూ, అవునన్నట్లుగా తల ఊపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

నాలుగేళ్ల లవ్ స్టోరీ

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఆన్-స్క్రీన్ మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ జంట.. ఆఫ్-స్క్రీన్‌లోనూ ప్రేమలో ఉన్నారని 2020 నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరి వెకేషన్ ఫొటోల్లో ఒకే రకమైన లొకేషన్లు ఉండటాన్ని ఫ్యాన్స్ చాలాసార్లు గమనించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగినప్పుడు కూడా రష్మిక స్పందిస్తూ.. "ఈ రూమర్స్ వచ్చి నాలుగేళ్లయింది కదా? కానీ నిజం చెప్పాలంటే.. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నేనే మాట్లాడతాను" అని దాటవేసింది.

రష్మిక కెరీర్ ఇలా..

ఇక ఈ స్టార్ కపుల్ సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ చివరిగా నటించిన 'కింగ్‌డమ్' (Kingdom) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 82 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రస్తుతం అతని చేతిలో 'రణబాలి', 'రౌడీ జనార్ధన' సినిమాలు ఉన్నాయి.

మరోవైపు 2025 రష్మికకు కలిసొచ్చింది. 'ఛావా', 'కుబేర', ‘థామ’, 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి విజయాలతో ఆమె జోరుమీదుంది. 'సికిందర్' మాత్రమే కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె విజయ్‌తో కలిసి 'రణబాలి'లో నటిస్తుండటంతో పాటు.. 'కాక్‌టెయిల్ 2', 'మైసా' చిత్రాల్లోనూ నటిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More