Mysaa Release Date: పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఇంటెన్స్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా లాక్ చేశారు. నవంబర్ 27, 2026న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ట్రైబల్ యాక్షన్‌తో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్

"ది రేజ్, ది పెయిన్, ది గ్రీఫ్.. మైసా రాబోతోంది" అంటూ రష్మిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో నెత్తుటి మరకలతో, చేతిలో ఈటె పట్టుకుని ఒక గోండు యువతిగా రష్మిక నెవర్ బిఫోర్ ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తోంది.
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌లో మెప్పించిన నేషనల్ క్రష్, ఈ సినిమాలో ఒక డేంజరస్ గిరిజన యువతిగా తనలోని ఇంటెన్స్ యాంగిల్‌ను బయటపెట్టబోతోంది.
రికార్డ్ బ్రేకింగ్ అండర్ వాటర్ ఫైట్
ఈ మైసా మూవీలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఒక సెన్సేషనల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానుంది. ఒక పవర్‌ఫుల్ అండర్ వాటర్ ఫైట్ కోసం రష్మిక దాదాపు 20 గంటల పాటు నీళ్లలోనే ప్రాక్టీస్ చేసి డెడికేషన్‌తో షూట్ కంప్లీట్ చేసింది.
ఆసియా ఫిల్మ్ హిస్టరీలోనే ఒక ఫిమేల్ యాక్టర్‌పై ఇలాంటి అండర్ వాటర్ యాక్షన్ సీన్ షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ ఒక్క సీన్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ.
టాప్ టెక్నికల్ వాల్యూస్.. భారీ తారాగణం
డైరెక్టర్ రవీంద్ర పుల్లె (Rawindra Pulle) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం లాంటి భారీ క్యాస్టింగ్ ఉంది.
{{/usCountry}}డైరెక్టర్ రవీంద్ర పుల్లె (Rawindra Pulle) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం లాంటి భారీ క్యాస్టింగ్ ఉంది.
{{/usCountry}}ముఖ్యంగా జేక్స్ బిజోయ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోయనున్నాయి. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ (UnFormula Films) బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో పాన్ ఇండియా రిలీజ్ గా వస్తోంది.
వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ
తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా నవంబర్ 27న పాన్ ఇండియా లెవల్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 'పుష్ప 2' లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత రష్మిక లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
రీసెంట్‌గా షాహిద్ కపూర్‌తో కలిసి బాలీవుడ్‌లో 'కాక్‌టెయిల్ 2' చేసిన రష్మిక.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన 'రణబాలి' సినిమాలో కూడా నటిస్తోంది. అక్టోబర్ 16న రణబాలి రిలీజ్ కానుండగా, నవంబర్‌లో 'మైసా' తో బాక్సాఫీస్ వద్ద తన యాక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతోంది. గతేడాది నవంబర్ లోనే ది గర్ల్‌ఫ్రెండ్ తో సక్సెస్ అందుకోగా.. ఈసారి కూడా మైసాతో మరో హిట్ కోసం రష్మిక చూస్తోంది.