Rashmika Mandanna Vijay Deverakonda On Trolling: వెండితెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విరోష్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి'.
ఓవరాక్టింగ్, క్రింజ్ ట్రోల్స్

ప్రస్తుతం రణబాలి సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ జంట ఇంటర్వ్యూలలో తమ వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా నెగెటివిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ కీర్తిక గోవిందసామితో జరిగిన ముఖాముఖిలో రష్మిక మాట్లాడుతూ, తన ఆప్యాయతను కొందరు 'ఓవరాక్టింగ్', 'క్రింజ్' అని ట్రోల్ చేయడంపై స్పందించారు.
మంచితనం బలహీనత కాదు.. నా తీరు మారదు!
"నా దృష్టిలో మంచితనంతో ఉండటం బలహీనత ఎంతమాత్రం కాదు. మన చుట్టూ ప్రతికూల ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయి. ఇలాంటి సమయంలో నాలుగు మంచి మాటలు మాట్లాడి, కొద్దిగా పాజిటివిటీని పంచడానికే నేను మొగ్గు చూపుతాను. నా ప్రవర్తనను కొందరు ఓవరాక్టింగ్ అని విమర్శించినా నేను పట్టించుకోను. అందరికీ అందరూ నచ్చాలనే నిబంధన ఏమీ లేదు కదా!" అని రష్మిక మందన్నా చెప్పుకొచ్చారు.
ముసుగు వేసుకోవడం చేతకాదు
ఇతరులను మెప్పించడానికి ముసుగు వేసుకోవడం తనకు చేతకాదని ఆమె తేల్చి చెప్పారు. "నేను ఎలా ఉంటానో నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు తెలుసు. వారి సంతోషమే నాకు ముఖ్యం. ఎవరికోసమో నా అసలు వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. నేను నాలా ఉండటంలోనే నాకు నిజమైన ఆనందం లభిస్తుంది" అని రష్మిక మందన్నా పేర్కొన్నారు.
ట్రోలింగ్ అంతా కుట్రపూరితం: విజయ్ దేవరకొండ
రష్మిక మందన్నా వ్యాఖ్యలకు తోడుగా విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా నెగెటివిటీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ తారలు, రాజకీయ నాయకులపై జరిగే ట్రోలింగ్‌లో చాలా భాగం పక్కా ప్రణాళికతో జరిగే ప్రచారం అని ఆయన వ్యాఖ్యానించారు.
నెగెటివిటీ కోసం వ్యవస్థలను నడుపుతున్నారు
{{/usCountry}}రష్మిక మందన్నా వ్యాఖ్యలకు తోడుగా విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా నెగెటివిటీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ తారలు, రాజకీయ నాయకులపై జరిగే ట్రోలింగ్‌లో చాలా భాగం పక్కా ప్రణాళికతో జరిగే ప్రచారం అని ఆయన వ్యాఖ్యానించారు.
నెగెటివిటీ కోసం వ్యవస్థలను నడుపుతున్నారు
{{/usCountry}}"ఒక వ్యక్తిని నేరుగా కలవకుండా, వారితో సమయం గడపకుండా వారి వ్యక్తిత్వంపై అంత కచ్చితమైన అభిప్రాయానికి ఎలా రాగలరు? నేటి డిజిటల్ యుగంలో 15 నకిలీ ఖాతాలు తెరవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకరిపై నెగెటివ్ అభిప్రాయాన్ని రుద్దడానికి కొందరు వ్యవస్థలను నడుపుతున్నారు" అని విజయ్ దేవరకొండ విశ్లేషించారు.
నిజమైన ప్రవర్తనను మార్చుకోవాల్సన అవసరం లేదు
ఇలాంటి నెగెటివ్ నరేటివ్స్ చూసి ఎవరూ తమ నిజమైన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణబాలి' చిత్రం 19వ శతాబ్దపు దక్షిణాది నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా.
ఏడేళ్ల తర్వాత 'రణబాలి'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు..
ఆంగ్లేయుల పాలనలో వచ్చిన కరువు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.