...
...
Next Story

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఇదే.. వేదిక కూడా ఫిక్స్ చేసేసిన సెలబ్రిటీ కపుల్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి డేట్, వేదిక కన్ఫమ్ అయింది. ఈ విషయాన్ని ఈ సెలబ్రిటీ కపుల్ సన్నిహిత వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ తో వెల్లడించాయి. ఈ ఏడాది అక్టోబర్ లో వీళ్లు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

Published on: Dec 29, 2025, 19:53:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌లోనే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్.. 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాళ్ల సన్నిహిత వర్గాలే తెలిపాయి.

రష్మిక, విజయ్ పెళ్లి డేట్, వెన్యూ ఇవే

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఇదే.. వేదిక కూడా ఫిక్స్ చేసేసిన సెలబ్రిటీ కపుల్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఇదే.. వేదిక కూడా ఫిక్స్ చేసేసిన సెలబ్రిటీ కపుల్

గీత గోవిందం జంట త్వరలో రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి బయట ఎక్కడా చెప్పకపోయినా.. పెళ్లి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ కు ఈ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

విజయ్, రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లితో ఒక్కటవనున్నారు. వీళ్లు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లోని ఓ హిస్టారిక్ ప్యాలెస్ ను ఇప్పటికే బుక్ చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి కూడా సింపుల్‌గానే..

రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ ఎవరికీ తెలియకుండా చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఈ జంట అఫీషియల్ గా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ లాగానే.. పెళ్లి కూడా చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగనుంది. హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఇస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అక్టోబర్‌లోనే ఎంగేజ్‌మెంట్

అక్టోబర్ 3, 2025న (దసరా మరుసటి రోజు) హైదరాబాద్‌లో వీరిద్దరూ సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నారని విజయ్ టీమ్ అప్పట్లో ధృవీకరించింది. అప్పటి నుంచే ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరూ వేళ్లకు ఉంగరాలతో కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈమధ్యే ఈ జంట వెకేషన్ కోసం బయటకు వెళ్లింది. ఎయిర్‌పోర్టులో కనిపించిన వీళ్ల వీడియోలు వైరల్ అయ్యాయి.

విజయ్, రష్మిక లవ్ స్టోరీ ఇలా..

"నాకు సంబంధం లేని బాధ నుంచి కూడా నా పార్ట్నర్ నన్ను కోలుకునేలా చేశాడు" అని రష్మిక ఇటీవల వ్యాఖ్యానించింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఈ జంట ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో కూడా వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe