...
...
Next Story

పెళ్లి పనులు మొదలుపెట్టిన రష్మిక మందన్నా.. విజయ్‌తో ఏడడుగులు వేయడం కోసం వేదిక వెతికే పనిలో నేషనల్ క్రష్

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ పెళ్లి పనులు మొదలయ్యాయి. వీళ్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని, అది కూడా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో అన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడో వార్త ఆసక్తి రేపుతోంది.

Published on: Nov 7, 2025, 17:55:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరుగా మొదలయ్యాయని తాజాగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రష్మిక మందన్న ఒక 'గ్రాండ్ సెలబ్రేషన్' కోసం అనువైన వేదికలను వెతకడానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లింది.

ఉదయ్‌పూర్‌లో రష్మిక పెళ్లి ఏర్పాట్లు

పెళ్లి పనులు మొదలుపెట్టిన రష్మిక మందన్నా.. విజయ్‌తో ఏడడుగులు వేయడం కోసం వేదిక వెతికే పనిలో నేషనల్ క్రష్
పెళ్లి పనులు మొదలుపెట్టిన రష్మిక మందన్నా.. విజయ్‌తో ఏడడుగులు వేయడం కోసం వేదిక వెతికే పనిలో నేషనల్ క్రష్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ ఈ మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెళ్లి వేదికల అన్వేషణలో భాగంగా రష్మిక ఇటీవల ఉదయ్‌పూర్‌కు ఒక చిన్న ట్రిప్ వేసింది. తన జీవితంలో అతిపెద్ద ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవడానికి ఈ నటి స్వయంగా ఆ పనులు చూసుకుంటోంది.

“రష్మిక ఉదయ్‌పూర్‌లో అనువైన వేదికల కోసం వెతకడానికి వెళ్లడం నిజం. ఆమె మూడు రోజులు అక్కడే ఉండి, ఆ నగరంలో ఉన్న లొకేషన్లు, రాజభవనం లాంటి రిసార్ట్‌లను పూర్తిగా చూశారు. ఉదయ్‌పూర్ దాని ప్యాలెస్ రిసార్ట్‌లు, సరస్సులకు చాలా ప్రసిద్ధి చెందింది. విజయ్‌తో తన శాశ్వత బంధాన్ని అక్కడ పదిలం చేసుకోవడానికి ఈ నగరం సరైనదని రష్మిక భావిస్తోంది” అని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని అనేక రిపోర్టులు వెల్లడించినప్పటికీ.. ఉదయ్‌పూర్‌లో ఇంకా ఎలాంటి బుకింగ్‌లు జరగలేదని అంతర్గత వర్గాలు తెలిపాయి. “రష్మిక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. ఉదయ్‌పూర్ కచ్చితంగా ఆమె ఆలోచనలో ఉంది. కానీ బుకింగ్‌ల గురించి మాత్రం ఇంకా స్పష్టత లేదు” అని ఆ వర్గాలు జోడించాయి.

రష్మిక, విజయ్ దేవరకొండ ఈ ఏడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట అధికారిక ప్రకటన చేయకపోయినా లేదా ఆ ఫొటోలు పంచుకోకపోయినా, విజయ్ టీమ్ ఈ నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. అలాగే వారు ఫిబ్రవరి 2026లో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అతని టీమ్ స్పష్టం చేసింది.

'గీత గోవిందం' (2018), 'డియర్ కామ్రేడ్' (2019) సినిమాలలో కలిసి నటించినప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య డేటింగ్ పుకార్లు వినిపిస్తున్నాయి. రష్మిక, విజయ్ తరచుగా కలిసి కనిపించారు. ఆగస్టులో వారు న్యూయార్క్‌లో జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్నారు. చాలా మంది అభిమానులు వీరిద్దరూ ఒకే చోటు నుంచి వెకేషన్ ఫొటోలను పంచుకోవడం గమనించారు. ఇది వారి రిలేషన్‌షిప్‌ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. 2024లో వారు తాము సింగిల్ కాదని ధృవీకరించినప్పటికీ, తమ భాగస్వాముల పేర్లను మాత్రం చెప్పడానికి నిరాకరించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks