గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులు, దుష్ప్రచారంపై నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఆమె.. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. తన పేరిట వైరల్ అవుతున్న ఓ పాత ఆడియో క్లిప్ ను 24 గంటల్లో తొలగించాలని, లేదంటే లీగల్ యాక్షన్ అప్పదని రష్మిక హెచ్చరించింది.
'నా ప్రైవసీకి భంగం కలిగించారు'

గత ఎనిమిదేళ్లుగా మీడియాలోని ఒక విభాగం, కొందరు వ్యక్తులు తనపై పథకం ప్రకారం వేధింపులకు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని రష్మిక మందన్న ఆవేదన వ్యక్తం చేసింది. "నా మాటలను వక్రీకరించారు, నేను అనని మాటలను అన్నట్లుగా చిత్రికరించారు. కేవలం వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం నాపై ద్వేషాన్ని పెంచారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు సహజమని ఇన్నాళ్లూ ఓపికగా, మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో జరిగిన సంఘటనలు అన్ని హద్దులను దాటేశాయి" అని ఆమె పేర్కొంది.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను, తన ప్రమేయం లేకుండా రికార్డ్ చేసి, ఇప్పుడు సందర్భం లేకుండా బయటపెట్టడంపై ఆమె మండిపడింది. తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా, వ్యూహాత్మకంగా ఈ వివాదాన్ని సృష్టించారని ఆమె ఆరోపించింది.
24 గంటల గడువు.. లేదంటే లీగల్ యాక్షన్!
తనతో పాటు తన కుటుంబ సభ్యులను, తనతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇతరులను ఈ వివాదంలోకి లాగడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె మీడియా సంస్థలకు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
{{/usCountry}}తనతో పాటు తన కుటుంబ సభ్యులను, తనతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇతరులను ఈ వివాదంలోకి లాగడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె మీడియా సంస్థలకు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
{{/usCountry}}తన పరువుకు భంగం కలిగించేలా ఉన్న పోస్ట్‌లను, వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రకటన విడుదల చేసిన 24 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలపై కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని రష్మిక స్పష్టం చేసింది.
నా జీవితం.. నా ఇష్టం
ప్రకటన చివరలో కన్నడ భాషలో స్పందిస్తూ.. "ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఒక మాట మాత్రం చెప్పాలి.. మా వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మా జీవితం ఎలా ఉండాలో మీరు నిర్ణయించలేరు. మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం" అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఈ మధ్యే విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న ఆ వెంటనే ఇలా ఓ ఘాటైన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రష్మిక టాలీవుడ్ లో అంతగా పేరు సంపాదించక ముందు అంటే సుమారు 8 ఏళ్ల కిందట ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రష్మిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వివాదాస్పద అంశాలు ఉండటంతో ఆమె ఇలా తీవ్రంగా స్పందించింది.