...
...
Next Story

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఓ సూపర్ రొమాంటిక్ మెలోడీ.. అదిరిపోయే లొకేషన్లు.. డింపుల్ అందాలు

రవితేజ, డింపుల్ హయతి లీడ్ రోల్స్ లో నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఇదొక రొమాంటిక్ మెలోడీ. అదిరిపోయే లొకేషన్లు, చీరల్లో డింపుల్ అందాలతో ఈ పాట సాగిపోయింది.

Published on: Dec 10, 2025, 18:33:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మాస్ మహారాజ రవితేజ ఈసారి సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ మధ్యే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. బుధవారం (డిసెంబర్ 10) అద్దం ముందు నిలబడి అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.

అద్దం ముందు నిలబడి సాంగ్

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఓ సూపర్ రొమాంటిక్ మెలోడీ.. అదిరిపోయే లొకేషన్లు.. డింపుల్ అందాలు
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఓ సూపర్ రొమాంటిక్ మెలోడీ.. అదిరిపోయే లొకేషన్లు.. డింపుల్ అందాలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోని లీడ్ రోల్స్ రవితేజ, డింపుల్ హయతి మధ్య సాగే రొమాంటిక్ మెలోడీ అద్దం ముందు నిలబడి వచ్చేసింది. యూరప్ లోని అదిరిపోయే లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ లిరికల్ వీడియోలో షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఇందులో రవితేజ, డింపుల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి.

ఈ పాటను చంద్రబోస్ రాయగా.. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఇక శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలన్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశాడు. ఇదే మూవీ నుంచి ఈ మధ్యే బెల్లా బెల్లా అనే ఫస్ట్ సింగిల్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ గురించి..

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈసారి సంక్రాంతికి ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నాడు. అయితే దీనికి ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల రూపంలో గట్టి పోటీయే ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఏం చేస్తాడన్నది చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe