...
...
Next Story

Irumudi Bookings: ఇరుముడి బాక్సాఫీస్ ర్యాంపేజ్.. చిరంజీవి రికార్డు తుడిచిపెట్టేసిన రవితేజ.. సరికొత్త టాలీవుడ్ రికార్డు

Irumudi Bookings: రవితేజ ఇరుముడి మూవీ తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఏకంగా చిరంజీవి రికార్డునే బ్రేక్ చేయడం విశేషం. మాస్, క్లాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.

Published on: Aug 21, 2026, 18:47:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Irumudi Bookings: మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' ఫస్ట్ రోజే రికార్డుల దుమ్ముదులుపుతోంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. బుక్‌మైషోలో గంటకు 32.25 వేల టికెట్లు అమ్ముడై రీజనల్ సినిమా కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

మెగాస్టార్ రికార్డును దాటేసిన రవితేజ ర్యాంపేజ్

Irumudi Bookings: ఇరుముడి బాక్సాఫీస్ ర్యాంపేజ్.. చిరంజీవి రికార్డు తుడిచిపెట్టేసిన రవితేజ.. సరికొత్త టాలీవుడ్ రికార్డు
Irumudi Bookings: ఇరుముడి బాక్సాఫీస్ ర్యాంపేజ్.. చిరంజీవి రికార్డు తుడిచిపెట్టేసిన రవితేజ.. సరికొత్త టాలీవుడ్ రికార్డు

బుక్‌మైషో (BookMyShow) హిస్టరీలోనే ఒక రీజనల్ సినిమా సాధించిన బిగ్గెస్ట్ సేల్స్ రికార్డ్‌ను 'ఇరుముడి' తన పేరిట రాసుకుంది. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' పేరిట ఉన్న గంటకు 31.6 వేల టికెట్ల రికార్డును ఇరుముడి సులువుగా బ్రేక్ చేసింది.

కేవలం ఒకే ఒక్క గంటలో 32.25 వేల టికెట్లు అమ్ముడవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. మాస్ మహారాజా ఎమోషనల్ కంటెంట్‌తో వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ వస్తుందో ఈ మైండ్ బ్లాకింగ్ నంబర్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఈవినింగ్, నైట్ షోస్ ఫుల్ హౌస్.. సిటీ వైజ్ ఆక్యుపెన్సీ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్, నైట్ షోలకు థియేటర్లలో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మెయిన్ సెంటర్లలో ఆడియెన్స్ రష్ తట్టుకోలేక ఎగ్జిబిటర్లు ప్రతి గంటకూ అదనపు షోలు, ఎక్స్‌ట్రా స్క్రీన్‌లను యాడ్ చేస్తున్నారు. నిజానికి ఉదయం కూడా ఫ్యామిలీస్ తో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం.

సిటీల వారీగా ఆక్యుపెన్సీ గణాంకాలు పరిశీలిస్తే..

విజయవాడ: 76 స్క్రీన్లలో 74 హౌస్‌ఫుల్స్

వైజాగ్: 64 కి 64 స్క్రీన్లు కంప్లీట్ హౌస్‌ఫుల్

గుంటూరు: 43 లో 38 హౌస్‌ఫుల్స్

కాకినాడ: 20 లో 19 హౌస్‌ఫుల్స్

వరంగల్: 20 లో 18 హౌస్‌ఫుల్స్

తిరుపతి: 17 లో 16 హౌస్‌ఫుల్స్

నెల్లూరు: 16 లో 14 హౌస్‌ఫుల్స్

కర్నూలు: 19 లో 14 హౌస్‌ఫుల్స్

కరీంనగర్: 8 లో 6 హౌస్‌ఫుల్స్

'క్రాక్' రికార్డులు అవుట్.. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

రవితేజ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 'క్రాక్' సినిమా రికార్డులను ఇరుముడి చాలా ఈజీగా క్రాస్ చేసేలా ఉంది. మొదటి రోజు సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే వీకెండ్ ముగిసే సరికి రవితేజ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్వామి అయ్యప్ప మాలధారణ, తండ్రి-కూతుళ్ల అనుబంధం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ నటన, బేబీ నక్షత్ర ఎమోషనల్ సీన్లు ఆడియెన్స్‌ను బాగా కనెక్ట్ చేశాయి. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్ కీలక పాత్రల్లో తమ మార్క్ చూపించారు.

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువులతో నిర్మించింది. 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి క్లాసిక్ ఎమోషనల్ డ్రామాలను అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. తన విజన్‌తో మాస్ కమ్ ఎమోషనల్ కాంబినేషన్‌ను పర్‌ఫెక్ట్‌గా ప్రెసెంట్ చేశారు.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా ఎమోషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఎటు చూసినా పాజిటివ్ టాక్ రావడం, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంటి వారు ప్రశంసించడంతో శని, ఆదివారాల్లో బుకింగ్స్ మరింత అమాంతం పెరిగే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe