Irumudi Budget: ఇరుముడి లాభాల లెక్కలు చెప్పిన ప్రొడ్యూసర్లు.. ఊహించినదాని కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువే వచ్చాయ్..

Irumudi Budget: ఇరుముడి మూవీ బడ్జెట్, బాక్సాఫీస్ వసూళ్ల, లాభాల లెక్కలను ప్రొడ్యూసర్లు అధికారికంగా వెల్లడించారు. రవితేజ కెరీర్లో తొలి రూ.200 కోట్ల సినిమాగా నిలిచిన ఇరుముడి.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది.

Published on: Sep 2, 2026, 21:18:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi Budget: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన అసలైన రాంపేజ్ చూపిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఇరుముడి' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసి నాన్-స్టాప్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ మైత్రీ నవీన్ ఈ సినిమా బడ్జెట్, లాభాల లెక్కలను అధికారికంగా రివీల్ చేశారు.

Irumudi Budget: ఇరుముడి లాభాల లెక్కలు చెప్పిన ప్రొడ్యూసర్లు.. ఊహించినదాని కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువే వచ్చాయ్..
Irumudi Budget: ఇరుముడి లాభాల లెక్కలు చెప్పిన ప్రొడ్యూసర్లు.. ఊహించినదాని కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువే వచ్చాయ్..

రోజున్నరలోనే బ్రేక్ ఈవెన్.. బిజినెస్ సీక్రెట్ ఇదే

సాధారణంగా రవితేజ సినిమాలంటే భారీగా ఖర్చు పెడుతుంటారు. కానీ 'ఇరుముడి' సినిమాను కేవలం రూ. 50 కోట్ల రీజనబుల్ బడ్జెట్‌తోనే పూర్తి చేసినట్లు మైత్రీ నవీన్ వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో చాలా పక్కా ప్లానింగ్‌తో, చెప్పిన టైమ్ ఫ్రేమ్‌లోనే రియల్ లోకేషన్లలో షూటింగ్ పూర్తి చేశామని చెప్పారు.

సినిమా రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల (డిజిటల్, శాటిలైట్, ఆడియో) రూపంలోనే బడ్జెట్‌లో ఎక్కువ భాగం రికవరీ అయిపోయిందని మేకర్స్ తెలిపారు. థియేట్రికల్ బిజినెస్ భారం కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ఉండటంతో.. సినిమా రిలీజైన కేవలం రోజున్నర వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్వాడ్రపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

మైండ్ సెట్ మార్చేసింది.. డైరెక్టర్ శివ నిర్వాణ ఎమోషనల్

ఈ సినిమా విజయం తన మైండ్ సెట్ మార్చేసిందని డైరెక్టర్ శివ నిర్వాణ ఎమోషనల్ అయ్యారు. గతంలో తన దర్శకత్వంలో వచ్చిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి సినిమాలు చూసి తను కేవలం కూల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే తీయగలడనే ఒక బ్రాండ్ పడిపోయిందని చెప్పారు.

కానీ 'ఇరుముడి' సాధించిన ఈ భారీ విజయం తనకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను, నమ్మకాన్ని ఇచ్చిందని.. ఇకపై ఏ జానర్‌లోనైనా సినిమాలు చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని శివ నిర్వాణ వెల్లడించారు. భక్తి, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అనే మూడు లేయర్లను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేయడం వల్లే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను తమ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

రవితేజ కెరీర్‌లో తొలి రూ.200 కోట్ల క్లబ్

ఇరుముడి సినిమాలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి, వ్యవస్థలో ఉన్న విషపూరితమైన వ్యక్తుల గురించి చాలా హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ఇచ్చామని శివ నిర్వాణ స్పష్టం చేశారు. ఏ మెసేజ్ అయినా స్టోరీలో ఆర్గానిక్‌గా కలిసిపోవాలే తప్ప కావాలని చొప్పించినట్లు ఉండకూడదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక రవితేజ ఎనర్జీ, క్యారెక్టర్ వేరియేషన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని ప్రొడ్యూసర్లు కొనియాడారు. థియేటర్లకు కేవలం యూత్ మాత్రమే కాకుండా వృద్ధులు, కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూస్తుండటంతో తమ అంచనాల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ కెరీర్‌లోనే మొదటి రూ. 200 కోట్ల మైలురాయిగా నిలిచిన 'ఇరుముడి' ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More