రవితేజ ఈ మధ్యే మాస్ జాతర మూవీ ఇచ్చిన షాక్ నుంచి పూర్తిగా కోలుకోనే లేదు.. నెక్ట్స్ మూవీకి సిద్ధమయ్యాడు. “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అంటూ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఓ గ్లింప్స్ వీడియోను సోమవారం (నవంబర్ 10) మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగినట్లే వీడియో కూడా ఫన్నీగా ఉంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ గ్లింప్స్

రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తాజాగా వచ్చిన టైటిల్ గ్లింప్స్ వీడియో కొత్తగా, ఫన్నీగా ఉంది. మాస్ రవితేజను కాస్త భిన్నమైన పాత్రలో ఈ సినిమా చూపించబోతున్నట్లు టైటిల్ గ్లింప్స్ వీడియో చూస్తే తెలుస్తోంది.
ఇందులో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపిస్తున్నాడు. తన ఇద్దరు భామలు తనను రెండు ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానం కోసం గూగుల్, ఏఐ, జెమిని, చాట్‌జీపీటీలను కూడా అడిగానని, వాటికి పెళ్లి కాకపోవడంతో సమాధానం చెప్పలేకపోయానని రవితేజ చెబుతాడు. ఇక ఆ తర్వాత అనుభవం ఉన్న మగాళ్లు, ముఖ్యంగా మొగుళ్లను అడిగినా.. ఆశ్చర్యపోయారే తప్ప సమాధానం చెప్పలేకపోయారంటాడు.
దీంతో అసలు ఆ ప్రశ్నలు ఏంటి? వాటికి సమాధానం మీకైనా తెలుసా అని అడుగుతున్నట్లుగా ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టైటిల్ గ్లింప్స వీడియో సాగిపోయింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ గురించి..
రవితేజ ఈ మధ్యే మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఎంతో లేపడానికి ప్రయత్నించినా.. అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ నేపథ్యంలో రవితేజ ఇప్పుడు ఇలా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నాడు.
తన మార్క్ కామెడీతోపాటు కథాంశం కూడా భిన్నంగా ఉండబోతున్నట్లు ఈ చిన్న వీడియోతో స్పష్టమైంది. అయితే సంక్రాంతికి వస్తుండటంతో అప్పుడు వచ్చే సినిమాలతో ఎలా పోటీ పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}తన మార్క్ కామెడీతోపాటు కథాంశం కూడా భిన్నంగా ఉండబోతున్నట్లు ఈ చిన్న వీడియోతో స్పష్టమైంది. అయితే సంక్రాంతికి వస్తుండటంతో అప్పుడు వచ్చే సినిమాలతో ఎలా పోటీ పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}