...
...
Next Story

RCB vs SRH IPL 2026: ఐపీఎల్ తొలి మ్యాచ్- టాస్ గెలిచిన ఆర్సీబీ- 2 నిమిషాలు మౌనం పాటించిన క్రికెటర్స్- ఖాళీగా 11 సీట్లు!

IPL 2026 RCB vs SRH Tribute To 11 Died Fans: ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు తమ దివంగత అభిమానులకు అపూర్వ నివాళి అర్పించింది. గత ఏడాది జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది జ్ఞాపకార్థం స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచడంతో పాటు, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Published on: Mar 28, 2026, 20:41:48 IST
Advertisement

ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ (మార్చి 28) ప్రారంభమైంది. ఐపీఎల్ తొలి రోజున సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ పోడీ పడనున్నాయి. ఈపాటికే ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక విషాద జ్ఞాపకంతో నిశ్శబ్దమైంది.

అభిమానుల పట్ల ప్రేమ

ఐపీఎల్ తొలి మ్యాచ్- టాస్ గెలిచిన ఆర్సీబీ- 2 నిమిషాలు మౌనం పాటించిన క్రికెటర్స్- ఖాళీగా 11 సీట్లు! (AP)
ఐపీఎల్ తొలి మ్యాచ్- టాస్ గెలిచిన ఆర్సీబీ- 2 నిమిషాలు మౌనం పాటించిన క్రికెటర్స్- ఖాళీగా 11 సీట్లు! (AP)

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఆర్‌సీబీ యాజమాన్యం తమ అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ ఎంతో భావోద్వేగపూరిత నిర్ణయం తీసుకుంది.

11 మంది మృతి

గత ఏడాది జూన్ 4న ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ 11 ప్రాణాలకు గుర్తుగా ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులు అర్పించారు.

ఎప్పటికీ ఖాళీగానే ఆ 11 సీట్లు..

గత ఏడాది జరిగిన ఆ దుర్ఘటనను గుర్తుచేసుకుంటూ, చిన్నస్వామి స్టేడియంలోని 11 సీట్లను ఈ సీజన్ మొత్తం ఖాళీగా ఉంచాలని ఆర్‌సీబీ నిర్ణయించింది. "మా కుటుంబంలో సభ్యులైన ఆ 11 మంది అభిమానులకు ఇది మా శాశ్వత నివాళి. వారి మద్దతు ఎప్పటికీ ఆర్‌సీబీ కుటుంబంలో భాగంగానే ఉంటుంది" అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.

11 మంది జ్ఞాపకార్థం

కేవలం మ్యాచ్‌లోనే కాకుండా, ప్రాక్టీస్ సమయంలోనూ ఆటగాళ్లు 'నెంబర్ 11' కలిగిన జెర్సీలను ధరించి వారిని స్మరించుకున్నారు. మరోవైపు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆ 11 మంది జ్ఞాపకార్థం స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఒక స్మారక ఫలకాన్ని కూడా ఆవిష్కరించింది. గతేడాది జరిగిన చేదు అనుభవం దృష్ట్యా, ఈసారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలను, ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌ను అధికారులు రద్దు చేశారు.

2 నిమిషాల పాటు మౌనం

కాగా, ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ తరఫున అభినందన్ సింగ్, జాకబ్ డఫీ అరంగేట్రం చేస్తుండగా, ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రానున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ సలిల్ అరోరాకు అవకాశం ఇచ్చింది.

తుది జట్లు ఇవే:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగ.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks