Emmy OTT: సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' సిరీస్ ఇంటర్నేషనల్ లెవల్ లో అదరగొట్టింది. ప్రతిష్టాత్మక 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026లో డ్రామా సిరీస్ విభాగంలో నామినేషన్ దక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది.
ఇంటర్నేషనల్ లెవల్

మానవ్ కౌల్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ హిందీ డ్రామా సిరీస్ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.. యుకేకి చెందిన 'ఎ థౌజండ్ బ్లోస్', ఫ్రాన్స్ రూపొందించిన 'కారెమ్', అలాగే అర్జెంటీనాకు చెందిన 'మేనెమ్' వంటి అంతర్జాతీయ సిరీస్‌లతో పోటీ పడుతోంది.
జమ్మూ కశ్మీర్ నుంచి భారతదేశపు టాప్-టైర్ ఐ-లీగ్‌కి చేరుకున్న మొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కశ్మీర్‌లో ఒక చిన్న క్రీడా ప్రయాణంగా ప్రారంభమైన ఈ స్టోరీ, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
100 ఫుట్‌బాల్‌లతో మొదలైన విప్లవం
ఈ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్ సిరీస్ కథ వెనుక అత్యంత ఎమోషనల్ రియల్ స్టోరీ ఉంది. సెప్టెంబర్ 2014లో సంభవించిన భయంకరమైన వరదలు కశ్మీర్ లోయను ముంచెత్తినప్పుడు వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆ సమయంలో రిపోర్టర్ షమీమ్ మేరాజ్, వ్యాపారవేత్త సందీప్ ఛాటూ తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లోని స్థానిక యువతకు 100 ఫుట్‌బాల్స్ పంపిణీ చేశారు.
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్
ఆ చిన్న ప్రయత్నమే 2016లో శ్రీనగర్‌లో 'స్నో లెపర్డ్స్' అని పిలవబడే 'రియల్ కశ్మీర్ ఎఫ్‌సి' క్లబ్ ఆవిర్భావానికి పునాది వేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల సమయంలో మేరాజ్ తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి క్లబ్‌ను నడిపారు. చివరికి 2017-18 సీజన్లో ఐ-లీగ్ 2వ డివిజన్లో అజేయంగా నిలిచి టాప్ డివిజన్‌కు అర్హత సాధించింది. అంతేకాకుండా 2020, 2022లలో ఐఎఫ్ఏ షీల్డ్‌ను గెలుచుకుని భారత ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.
మానవ్ కౌల్ ఎమోషనల్
{{/usCountry}}ఆ చిన్న ప్రయత్నమే 2016లో శ్రీనగర్‌లో 'స్నో లెపర్డ్స్' అని పిలవబడే 'రియల్ కశ్మీర్ ఎఫ్‌సి' క్లబ్ ఆవిర్భావానికి పునాది వేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల సమయంలో మేరాజ్ తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి క్లబ్‌ను నడిపారు. చివరికి 2017-18 సీజన్లో ఐ-లీగ్ 2వ డివిజన్లో అజేయంగా నిలిచి టాప్ డివిజన్‌కు అర్హత సాధించింది. అంతేకాకుండా 2020, 2022లలో ఐఎఫ్ఏ షీల్డ్‌ను గెలుచుకుని భారత ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.
మానవ్ కౌల్ ఎమోషనల్
{{/usCountry}}ఇంటర్నేషనల్ ఎమ్మీ నామినేషన్ వార్త వినగానే తనకు నోట మాట రాలేదని నటుడు మానవ్ కౌల్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ప్యారిస్‌లో ఉన్న సమయంలో కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్ రావడంతో మొదట దర్శకుడు మహేష్ మథాయ్‌కి ఫోన్ చేశానని, ఆయన కూడా నమ్మలేక ఎమ్మీ అధికారిక పేజీని చెక్ చేసుకున్నారని మానవ్ వెల్లడించారు.
ఒక కశ్మీరీగా ఈ సినిమా తనకు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, కష్టకాలంలో కూడా నమ్మకంతో మార్పు సాధించవచ్చనే మనుషుల ఆశకు ఈ కథ నిదర్శనమని మానవ్ చెప్పారు. ఈ సిరీస్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదని తాను ఎప్పుడూ భావించేవాడినని, ఇప్పుడు ఎమ్మీ నామినేషన్‌తో ఈ కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరువవుతుందనే నమ్మకం కలిగిందని మానవ్ కౌల్ వ్యాఖ్యానించారు.