Renu Desai: మీరు మనుషులా? రాక్షసులా? ఈ బూతులు ఏంటీ? వచ్చి మీ అమ్మను అడుగుతా-ప్రైవేట్ పార్ట్స్ అంటారా: రేణు దేశాయ్ ఫైర్
Renu Desai: రేణు దేశాయ్ ఫైర్ అయింది. తనను బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్న వాళ్లపై విరుచుకుపడింది. మనుషులా? రాక్షషులా? అంటూ ఇన్ స్టాగ్రామ్ లైవ్ వీడియోలో రెచ్చిపోయింది. ఇక వదిలిపెట్టేదే లేదని, మీ ఇళ్ల వరకు వస్తానని వార్నింగ్ ఇచ్చింది.
రేణు దేశాయ్ కు తీవ్రమైన కోపమొచ్చింది. తన గురించి నీచమైన కామెంట్లు చేస్తున్న వాళ్లపై ఆమె ఫైర్ అయింది. శనివారం (ఫిబ్రవరి 28) ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో రెచ్చిపోయింది. బూతులు పెట్టే వాళ్లను ఇకపై వదలనని వార్నింగ్ ఇచ్చింది.

విడాకుల తర్వాత
‘‘నా విడాకుల తర్వాత నా గురంచి అన్ని రకాలుగా కామెంట్ చేశారు. ఇంకా ఏం మిగల్లేదని అనుకున్నా. కానీ నేను జనవరిలో కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టా. కొన్ని ఎన్జీవోలు కలిసి నన్ను ప్రెస్ మీట్ కు రమ్మంటే, ఫస్ట్ నేను రానని చెప్పా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే నాకు తిట్లు రావడం తప్పా ఏం ఉండదు అని క్లియర్ గా చెప్పా. కానీ మీరు మాట్లాడితేనే బాగుంటుందని పిలిచారు’’ అని రేణు దేశాయ్ తెలిపింది.
ఏమైనా తప్పుందా?
‘‘వందల కుక్కులను చంపేస్తున్నారంటే నాకూ బాధ వేసింది. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయి. దాని కోసం 90 కుక్కలను చంపకూడదని ప్రెస్ మీట్లో అన్నా. ఇందులో ఏమైనా తప్పుందా? నా మాటలను అర్థం చేసుకోకుండా మీడియా, స్టూపిడ్ యూట్యూబ్, స్టూపిడ్ ఇన్ స్టాగ్రామ్ లో సర్కస్ చేశారు. నన్ను బూతులు తిట్టారు’’ అని రేణు దేశాయ్ ఫైర్ అయింది
ఆ కామెంట్ చదివి
‘‘మనకు మాట్లాడే హక్కు ఉంది. నా బట్టలు బాలేకపోతే, యాక్టింగ్ నచ్చకపోతే చెప్పొచ్చు. కానీ ప్రతిసారి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి తిడుతున్నారు.
ప్రెస్ మీట్ లో ఓ వ్యక్తి వచ్చి నన్ను దున్నపోతు అన్నాడు. దాంతో కోప్పడ్డా. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆమెకే రేబిస్ వచ్చిందని అన్నారు. ఈ పిచ్చి కుక్కలు రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ ను కరిస్తే అప్పుడు తెలుస్తుందనే కామెంట్ చదివి వణికిపోయా’’ అని రేణు దేశాయ్ చెప్పింది.
నాకేం సంబంధం?
‘‘మొన్న ఓ కుల వివక్ష కారణంగా ఫైట్ లో చిన్నబిడ్డ చనిపోయింది. ఇందులో నాకు సంబంధమే లేదు. కానీ ఒక పనికి మాలిన వెధవ నేను కుక్కల గురించి మాట్లాడిన వీడియో పెట్టాడు. నన్ను తిడుతున్నారు. నాకు సంబంధం ఉందా? ప్రతిసారి నా మీద ఎందుకు పడుతున్నారు. ఆ బిడ్డను చంపిన వాళ్లను అరెస్ట్ చేయించండి’’ అని రేణు దేశాయ్ పేర్కొంది.
పనికి మాలిన వెధవల్లా
‘‘చేతిలో 5 వేల ఫోన్ పెట్టుకుని తిట్టడం ఎంత వరకు సంస్కారం. ఈ సారి బూతుల కామెంట్ చూస్తే మీ ఇంటి వరకు వస్తా. మీ అమ్మానాన్నకు, చెల్లెల్లకు మీ కామెంట్లు చూపిస్తా. పిల్లలను ఎలా పెంచారని మీ అమ్మను అడుగుతా. మీరు పనికి మాలిన వెధవల్లా ఉండిపోతారు.
నేను కాశీకి వెళ్తే మీకు ఏం ప్రాబ్లం? దానికి బూతులు ఎందుకు కామెంట్లు పెడతారు. నేను పబ్లిక్ లో వచ్చి కూర్చుంటా. వచ్చి నన్ను, నా పిల్లలను, నా తల్లిదండ్రులను తిట్టండి. కానీ దాని వల్ల ఒక్క ప్రాణమైనా సేవ్ అవుతుందా? అవుతుంది అంటే నేను భరిస్తా.
కాశీలో దిగిన ఫొటోకు ఏమో నైట్ రేట్ అంత అని అడుగుతారా? ఇది కరెక్ట్ కాదు. మీకు దమ్ము లేదు. దమ్ముంటే మీ ఎమ్మెల్యేను ఇలాగే తిట్టండి.
నేను యానిమల్ ఎన్జీవో పెట్టా. జంతువుల గురించి మాట్లాడుతా. మీకు మనుషుల గురించి బాధ ఉంటే మనుషుల గురించి ఆలోచించే ఎన్జీవోలు ఉన్నాయి కదా వాళ్లను అడగండి’’ అని రేణు దేశాయ్ ఫైర్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


