హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం (జనవరి 19) వీధి కుక్కల సమస్యపై నటి రేణు దేశాయ్ (Renu Desai), యాంకర్ రష్మీ గౌతమ్, దర్శకుడు శశి కిరణ్ తిక్కా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. చర్చ మధ్యలో రేణు దేశాయ్ సహనం కోల్పోయి అరవడం, ఆ వీడియోలు వైరల్ కావడం చర్చనీయాంశమైంది. దీనిపై రేణు దేశాయ్ స్వయంగా స్పందిస్తూ ఒక క్లారిఫికేషన్ వీడియో విడుదల చేసింది.
మగాళ్లు తప్పు చేస్తే అందరినీ చంపేస్తామా?

సమావేశంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ ప్రజల తీరుపై మండిపడ్డారు. "దోమ కాటు వల్ల, డెంగ్యూ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేక ప్రాణాలు పోతున్నాయి. అప్పుడు స్పందించని వారు.. కేవలం కుక్క కాటు అంటేనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కొందరు మగాళ్లు తప్పు చేశారని.. మగజాతి మొత్తాన్ని మనం చంపేస్తున్నామా? మరి కుక్కల విషయంలోనే ఎందుకు ఈ వివక్ష?" అని ఆమె సూటిగా ప్రశ్నించింది. మీకు మనుషుల ప్రాణాల కంటే కుక్కలపై ద్వేషమే ఎక్కువైపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఆ వ్యక్తి కొట్టడానికి వచ్చాడు.. అందుకే అరిచా!
ప్రెస్ మీట్ మధ్యలో రేణు దేశాయ్ ఒక వ్యక్తిపై గట్టిగా అరుస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె మీడియా వారిపై అరుస్తోందన్న వార్తలపై రేణు స్పష్టత ఇచ్చింది. "నేను మీడియా వారిని ఏమీ అనలేదు. బయటి నుంచి వచ్చిన ఒక 55 ఏళ్ల వ్యక్తి నా మీదకు దాడి చేయడానికి స్టేజ్ మీదకు రావడానికి ప్రయత్నించాడు. అందుకే సెక్యూరిటీ ఆయన్ని అడ్డుకున్నారు. నాకు కోపం వచ్చి ఆయన్ని మాత్రమే తిట్టాను. తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేయకండి" అని వివరణ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తావన, పిల్లలపై శాపనార్థాలు..
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ చూసి రేణు ఆవేదన చెందింది. "నేను ఇంటికి వెళ్లే దారిలో కామెంట్స్ చూశా. నేను వీధి కుక్కల కోసం మాట్లాడితే.. ‘అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశారు, నీకు తిక్క ఎక్కువ’ అని కామెంట్స్ చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు?" అని ఆమె ప్రశ్నించింది.
{{/usCountry}}ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ చూసి రేణు ఆవేదన చెందింది. "నేను ఇంటికి వెళ్లే దారిలో కామెంట్స్ చూశా. నేను వీధి కుక్కల కోసం మాట్లాడితే.. ‘అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశారు, నీకు తిక్క ఎక్కువ’ అని కామెంట్స్ చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు?" అని ఆమె ప్రశ్నించింది.
{{/usCountry}}అంతకంటే దారుణంగా.. "నీ పిల్లలు (అకీరా, ఆద్య) కుక్క కాటు వల్ల చస్తే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది" అని కొందరు శపించడం తనను కలిచివేసిందని రేణు కన్నీటిపర్యంతమయింది. "ఒక తల్లిగా ఆ మాటలు నన్నెంత బాధిస్తాయో మీకు తెలుసా? నేను రాజకీయాల్లోకి రావడం లేదు, డబ్బు కోసం చేయడం లేదు.. కేవలం తోటి ప్రాణుల కోసం మాట్లాడుతున్నా. నా పిల్లల చావు కోరుకుంటూ కామెంట్స్ చేయకండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది.