Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం నేను-షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు కొనేవాళ్లం-బాలు ప్యాంట్ అసలు కథ ఇదే: రేణు దేశాయ్

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కోసం లండన్ లో షాపింగ్ చేసినప్పటి ముచ్చట్లను ఆమె తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో షేర్ చేశారు. అలాగే బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్ గురించి కూడా షాకింగ్ విషయాలు చెప్పారు. 

Published on: Nov 4, 2026, 13:07:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి, ఖుషి, జానీ, బాలు.. ఇలా ఎన్నో సినిమాలు ఆయన స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ వెనుక రేణు దేశాయ్ కష్టం కూడా ఉంది. నటిగానే కాకుండా పవన్ సినిమాలకు ఆమె స్టైలిస్ట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'విజువల్ టాక్స్' అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రేణు.. 2001 నాటి కొన్ని అరుదైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం నేను-షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు కొనేవాళ్లం-బాలు ప్యాంట్ రేట్ ఎంతంటే: రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ కోసం నేను-షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు కొనేవాళ్లం-బాలు ప్యాంట్ రేట్ ఎంతంటే: రేణు దేశాయ్

లండన్ మాల్ లో కరణ్ జోహార్ తో షాపింగ్

ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన బట్టలు కొనడానికి రేణు దేశాయ్ ప్రత్యేకంగా లండన్ వెళ్లేవారట. అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె వివరించారు. "ఆ మాల్ లో కేవలం ఇద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. ఒకరు నేను కాగా, మరొకరు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్.

నేను పవన్ కళ్యాణ్ కోసం బట్టలు వెతుకుతుంటే, షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు సెలెక్ట్ చేసేవారు" అని రేణు చెప్పారు. కరణ్ కు షారుక్ పై ఉన్న ప్రేమతో అలా చేసేవారని, తాను పవన్ స్టైలిస్ట్ గా ఆ పని చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.

బాలు ప్యాంట్ స్టోరీ

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బాలు' (2005) సినిమాలో ఆయన కాస్ట్యూమ్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా ఆ సినిమాలో పవన్ వేసుకున్న ఒక ప్యాంట్ గురించి రేణు షాకింగ్ నిజాలు చెప్పారు. ఆ ప్యాంట్ ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదని, దానికి రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి చరిత్ర ఉందని ఆమె తెలిపారు.

ఆ ఒక్క ప్యాంట్ కొనుగోలు చేయడానికి అప్పట్లోనే సుమారు రూ. 75,000 ఖర్చు చేశారట. ఒక సినిమా కోసం కాస్ట్యూమ్స్ పై వారు పెట్టిన శ్రద్ధకు ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.

నటన కంటే ప్రొడక్షన్ పైనే ఇష్టం

తనకు మొదటి నుంచీ తెరపై కనిపించి హీరోయిన్ గా నటించడం కంటే, కెమెరా వెనుక ఉండి సినిమా మేకింగ్ లో పాల్గొనడం అంటేనే ఎక్కువ ఇష్టం అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన 'జానీ' సినిమాకి తను ప్రొడక్షన్ డిజైనర్ గా ఎలా పనిచేశానో కూడా ఈ పాడ్ కాస్ట్ లో ఆమె వివరించారు.

ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో గడపడం, ఆకాశాన్ని చూస్తూ ఉండిపోవడం తనకు ఇష్టమైన వ్యాపకాలు అని రేణు తన వ్యక్తిగత ఆసక్తులను పంచుకున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ చెప్పిన ఈ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో, గూగుల్ లో వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More