Buchibabu Vijay Deverakonda: పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ డమ్.. స్టార్ స్టారే..విజయ్ దేవరకొండపై బుచ్చిబాబు సంచలన కామెంట్లు!
Buchibabu Vijay Deverakonda: ఇప్పుడు ఎక్కడ చూసినా రణబాలి మేనియా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ బుచ్చిబాబు సాన సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ను పవన్ తో పోల్చుతూ మాట్లాడారు.
Buchibabu Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన 'రణబాలి' (Ranabaali) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) విజయ్ స్టార్ ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ క్రేజ్ ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

క్లాస్రూమ్ డోర్లు లాక్ చేశారు
మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి హైదరాబాద్ లో జరిగిన రణబాలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు సాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "గీత గోవిందం సినిమాకు పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నా ఉప్పెన సినిమాకు కూడా పనిచేశాడు. ఆయన నాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ చెప్పాడు.
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో గీతా గోవిందం షూటింగ్ జరుగుతున్న సమయంలో.. అక్కడ ఉన్న అమ్మాయిలు విజయ్ దేవరకొండను చూసి పిచ్చెక్కిపోయారట. విజయ్ క్రేజ్ తట్టుకోలేక కాలేజ్ మేనేజ్మెంట్ ఏకంగా క్లాస్రూమ్ డోర్లకు తాళాలు వేయాల్సి వచ్చింది. అది అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన టైమ్" అని బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ ఇమేజ్
విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్టార్‌గానే ఉంటాడని బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. "హిట్లు, ప్లాపులతో సంబంధం లేదు.. స్టార్ ఎప్పుడూ స్టారే. విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్ స్టార్. ఆయనకు మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ స్టార్ ఇమేజ్ ఉంది" అని బుచ్చిబాబు సాన పేర్కొన్నారు.
వైరల్ కామెంట్లు
విజయ్ దేవరకొండను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ బుచ్చిబాబు సాన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన స్టేజ్ మీద ఈ మాటలు అనగానే.. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ కేకలు, ఈలలతో థియేటర్‌ను తలపించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణబాలి గురించి
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


