Reporting Live Review: బాలీవుడ్ టాలెంటెడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రిపోర్టింగ్ లైవ్’. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వం వహించారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, ఇసుక మాఫియా అరాచకాలను ఎండగట్టే సాహసోపేతమైన జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ రూపొందింది. ప్రముఖ తమిళ నటుడు నాజర్ విలన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
రిపోర్టింగ్ లైవ్ మూవీ కథేంటంటే?

రిపోర్టింగ్ లైవ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. శుక్రవారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే అందుబాటులోకి వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పవరేంటో చూపించిన సినిమా ఇది. ఇసుక మాఫియా ఆగడాలు, దాని వెనుక వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి గురించి కళ్లకు కట్టింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 'ఆజాద్ భారతి' అనే ప్రముఖ టీవీ నెట్‌వర్క్‌లో పని చేసే న్యూస్ రిపోర్టర్ సంధ్య (పరిణీతి చోప్రా), కెమెరామెన్ వినోద్ (దేవెన్ భోజాని) చుట్టూ తిరిగే కథ ఇది. వీళ్లిద్దరూ కలిసి ముంబై సమీపంలోని ఒక గ్రామంలో వంతెన కూలి 14 మంది స్కూలు పిల్లలు, ఓ గర్బిణి మృతి చెందిన ఘటనను కవర్ చేయడానికి వెళ్తారు.
అయితే ఆ ఘటన ద్వారా దాని వెనుక ఆ గ్రామంలో జరుగుతున్న అతిపెద్ద ఇసుక మాఫియా గురించి తెలుసుకుంటారు. అక్కడి నుంచి వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, రాజకీయ ఒత్తిళ్ల చుట్టూ కథ తిరుగుతుంది.
సొంత ఛానెల్లోనే సవాళ్లు
సంధ్య, వినోద్‌లు తమ ఛానెల్ కోసం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తారు. అనుమతికి మించి నదులను తవ్వుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న 'బ్రిటిష్ గోల్డ్' లేదా బ్రౌన్ గోల్డ్ మాఫియా గుట్టును రట్టు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో శివ (అమోల్ పాలేకర్), మంగేష్ (పిటోబాష్ త్రిపాఠి) వంటి ఆ గ్రామానికి చెందిన ఉద్యమకారులు వీరికి కీలకమైన సమాచారాన్ని అందించి, రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు.
{{/usCountry}}సంధ్య, వినోద్‌లు తమ ఛానెల్ కోసం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తారు. అనుమతికి మించి నదులను తవ్వుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న 'బ్రిటిష్ గోల్డ్' లేదా బ్రౌన్ గోల్డ్ మాఫియా గుట్టును రట్టు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో శివ (అమోల్ పాలేకర్), మంగేష్ (పిటోబాష్ త్రిపాఠి) వంటి ఆ గ్రామానికి చెందిన ఉద్యమకారులు వీరికి కీలకమైన సమాచారాన్ని అందించి, రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు.
{{/usCountry}}మరోవైపు హెడ్ ఆఫీస్‌లో ఛానెల్ హెడ్ విదుర్ (ఆదిల్ హుస్సేన్), ఛానెల్ ఓనర్ శ్యామ్ (శేఖర్ సుమన్) మధ్య ఎడిటోరియల్ స్వేచ్ఛపై జరిగే వాదనలు వాస్తవ మీడియా పరిస్థితులకు అద్దం పడతాయి. సొంత ఛానెల్లోనే సంధ్య, వినోద్ ఎదుర్కొనే సవాళ్లు కూడా చాలా సహజంగా కనిపిస్తాయి. అయినా ఈ ఇద్దరూ ఆ ఇసుక మాఫియా వెనుక ఉన్న పెద్ద తలలను ఎలా బయటకు తెస్తారు? దానికి అడ్డుకట్ట వేయగలరా లేదా అన్నది మిగిలిన కథ.
వీకెండ్ చూడగల థ్రిల్లర్
ధ్రువ్ త్రిపాఠి, మిహిర్ జాదవ్‌లు రాసిన స్క్రీన్ ప్లే ఎలాంటి అనవసరపు హంగులకు పోకుండా చాలా గ్రిప్పింగ్‌గా, కేవలం 115 నిమిషాల నిడివితో పకడ్బందీగా సాగుతుంది. అయితే రన్‌టైమ్ తక్కువగా ఉండటంతో వాళ్లు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ఓ పెద్ద స్కాంను బయటకు తీసుకొచ్చే క్రమంలో న్యూస్ రిపోర్టర్లు ఎదుర్కొనే సవాళ్లను కూడా చూపించే ప్రయత్నం చేశారు.
పరిణీతి చోప్రా చాలాకాలం తర్వాత ఒక బలమైన జర్నలిస్ట్ పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సీరియస్ రోల్‌లో దేవెన్ భోజాని నటన కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మీడియాపై నమ్మకం సన్నగిల్లుతున్న ప్రస్తుత తరుణంలో, జర్నలిజం విలువలను గుర్తుచేసే ఈ 'రిపోర్టింగ్ లైవ్' నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడదగ్గ ఒక మంచి థ్రిల్లర్.