Rich Movie: ఈ సినిమా తర్వాత మేమంతా కూడా ‘రిచ్’ అవుతాం.. కొత్త హీరో మోహిత్ పెడాడ కామెంట్స్.. క్లైమాక్స్‌కి గూస్‌బంప్స్

Rich Movie Pooja Ceremony Mohit Pedada Comments: తెలుగులో వస్తోన్న లేటెస్ట్ లవ్ డ్రామా చిత్రం ‘రిచ్’. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది క్యాప్షన్. తాజాగా రిచ్ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 29, 2026, 12:31:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rich Movie Pooja Ceremony Mohit Pedada Comments: బేబీ ఆరాధ్య అండ్ ఆదర్శ్ సమర్పణలో ఎంజీ ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ కో ప్రొడ్యూసర్‌గా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక.

ఈ సినిమా తర్వాత మేమంతా కూడా ‘రిచ్’ అవుతాం.. కొత్త హీరో మోహిత్ పెడాడ కామెంట్స్.. క్లైమాక్స్‌కి గూస్‌బంప్స్
ఈ సినిమా తర్వాత మేమంతా కూడా ‘రిచ్’ అవుతాం.. కొత్త హీరో మోహిత్ పెడాడ కామెంట్స్.. క్లైమాక్స్‌కి గూస్‌బంప్స్

రిచ్ మూవీ పూజా కార్యక్రమం

మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న ఈ రిచ్ మూవీకి రాజ్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిచ్ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం (సెప్టెంబర్ 28) నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోపీ మోహన్, దశరథ్, వీ సముద్ర, జీ రామ్ ప్రసాద్, డిఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్,ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ .. "రాజ్ నరేంద్ర గారు ‘రిచ్’ కథను చాలా రిచ్‌గా చెప్పారు. ఆ తర్వాత ఈ కథలోకి గోపీ గారు వచ్చారు. సాయి కార్తీక్ ఆ తర్వాత జాయిన్ అయ్యారు. మోహిత్, శ్రీజిత ఘోష్ యాక్ట్ చేశారు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం" అని అన్నారు.

క్లైమాక్స్‌కి గూస్‌బంప్స్

కొత్త హీరో మోహిత్ పెడాడా మాట్లాడుతూ .. "మా ‘రిచ్’ లాంటి మంచి కథకు మంచి నిర్మాతలు దొరికారు. రాజా గారు అద్భుతంగా కథను రాసుకున్నారు. ఇంటర్వెల్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్‌కి గూస్ బంప్స్ వస్తుంది. యాక్టింగ్ చేస్తూ రాజా గారు కథను అద్భుతంగా నెరేట్ చేశారు" అని చెప్పాడు.

"సాయి కార్తీక్ పాటలు అద్భుతంగా వచ్చాయి. సతీష్ రెడ్డి గారి కెమెరా వర్క్ మా సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ మూవీ తర్వాత మేమంతా కూడా రిచ్ అవుతాం" అని హీరో మోహిత్ తెలిపాడు.

బస్తీ బాయ్ లవ్ స్టోరీని తీస్తున్నాం

"మా ‘రిచ్’ సినిమాని ఈ రోజు ప్రారంభించాం. పద్మనాభ రెడ్డి గారితో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాం. మా చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. మా సినిమాకి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని నిర్మాత మార్గం గోపి కోరారు.

దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ .. "మా ‘రిచ్’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుత తరానికి నచ్చేలా బస్తీ బాయ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం. మాకు మీడియా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుందని ఆశిస్తున్నాను" అని ఆకాంక్షించారు.

హిందీలోనూ డబ్ చేస్తాం

"నాకు తెలుగు అంతగా రాదు. ‘రిచ్’ మూవీని హిందీలోనూ రిలీజ్ చేస్తాం. ముందు తెలుగులో ఈ మూవీని విడుదల చేసి.. అక్కడ డబ్ చేస్తాం. అందమైన ప్రేమ కథతో ఈ చిత్రం రాబోతోంది" అని సహా నిర్మాత మహేంద్ర గైక్వాడ్ తెలిపారు.

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ .. "‘రిచ్’ సినిమాలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ఈ రోజు ఇలా మా మూవీ ప్రారంభోత్సవం జరగడం సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ‘రిచ్’ చిత్రం అందరినీ ఆకట్టుకోనుంది" అని చెప్పుకొచ్చారు.

ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాను

నటి పూజా కేంద్రే మాట్లాడుతూ .. "‘రిచ్’ చిత్రంలో నాకు మంచి రోల్ ఇచ్చారు. ఆద్యంత నవ్విస్తూనే ఉంటాను. మా సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More