ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కళానిధి మారన్ అత్యంత సంపన్న మూవీ ప్రొడ్యూసర్ గా అగ్రస్థానంలో నిలిచారు. రూ. 26,000 కోట్ల సంపదతో ఆయన బాలీవుడ్ దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టారు.
ఎవరీ భారత్ రిచెస్ట్ ఫిల్మ్ మేకర్?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రభావవంతమైన, అత్యంత సంపన్న వ్యక్తులతో కూడిన వార్షిక బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. 2026 ఏడాదికి గాను ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 4,000 మంది కుబేరులకు చోటు దక్కగా, అందులో భారత్ నుంచి 300 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇండియన్ మీడియా మొఘల్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా ఆయనే భారత్‌లో అత్యంత సంపన్న చిత్ర నిర్మాతగా కిరీటాన్ని దక్కించుకున్నారు.
వ్యాపార దిగ్గజం కళానిధి మారన్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ధనిక చిత్ర నిర్మాతగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ దాదాపు 2.8 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 26,000 కోట్లు). ఆయనకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' ద్వారా ఈ సంపదలో మెజారిటీ భాగం సమకూరింది. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సన్ పిక్చర్స్.. రోబో (Enthiran), పేట, బీస్ట్, జైలర్ వంటి భారీ బ్లాక్ బస్టర్లను అందించింది. ప్రస్తుతం రజనీకాంత్, అల్లు అర్జున్ లతో మూవీస్ చేస్తున్నారు.
బాలీవుడ్ దిగ్గజాల కంటే ఎంతో ముందు..
ఈ రేసులో కళానిధి మారన్ మరో ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాను వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్ జాబితాలో వినోద రంగం నుండి చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రోనీ మాత్రమే. ఆయన ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలతో పోల్చి చూస్తే మారన్ సంపద ఆశ్చర్యపోయే స్థాయిలో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (రూ. 7,500 కోట్లు), ఆదిత్య చోప్రా (రూ. 7,700 కోట్లు), కరణ్ జోహార్ (రూ. 2,000 కోట్లు) ఆస్తులన్నీ కలిపినా కళానిధి మారన్ ఆస్తిలో సగం కూడా ఉండవంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పత్రికా వ్యాపారం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం దాకా..
{{/usCountry}}ఈ రేసులో కళానిధి మారన్ మరో ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాను వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్ జాబితాలో వినోద రంగం నుండి చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రోనీ మాత్రమే. ఆయన ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలతో పోల్చి చూస్తే మారన్ సంపద ఆశ్చర్యపోయే స్థాయిలో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (రూ. 7,500 కోట్లు), ఆదిత్య చోప్రా (రూ. 7,700 కోట్లు), కరణ్ జోహార్ (రూ. 2,000 కోట్లు) ఆస్తులన్నీ కలిపినా కళానిధి మారన్ ఆస్తిలో సగం కూడా ఉండవంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పత్రికా వ్యాపారం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం దాకా..
{{/usCountry}}కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ కుమారుడైన కళానిధి మారన్.. 80వ దశకంలో తమ కుటుంబానికి చెందిన చిన్న పత్రికా ప్రచురణ సంస్థతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1993లో ఆయన 'సన్ టీవీ నెట్‌వర్క్'ను స్థాపించారు. నేడు ఇది 37 ఛానెళ్లతో, భారత్ లోని 14 కోట్ల ఇళ్లకు చేరువైన ఒక ప్రాంతీయ టెలివిజన్ దిగ్గజంగా ఎదిగిందని ఫోర్బ్స్ పేర్కొంది.
టెలివిజన్ రంగంతో పాటు వార్తాపత్రికలు, రేడియో, డీటీహెచ్ సర్వీసుల్లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాకుండా క్రీడా రంగంలోనూ మారన్ తన ముద్ర వేశారు. ఐపీఎల్ జట్టు 'సన్‌రైజర్స్ హైదరాబాద్', దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో 'సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్', యూకేలో 'సన్‌రైజర్స్ లీడ్స్' జట్లను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన భార్య కావేరి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కంటెంట్ బాధ్యతలు చూస్తుండగా, కుమార్తె కావ్యా మారన్ క్రికెట్ ఫ్రాంచైజీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.