ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటోంది. ఇక డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చి ఎంటర్ టైన్ చేసే సినిమాలు, సిరీస్ లు ఎన్నో. ఇప్పుడు ఆ కోవలోనే మరో మూవీ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆ సినిమా పేరు ‘రిధి’.
రిధి ఓటీటీ

రొమాంటిక్ లవ్ స్టోరీ రిధి ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇవాళ (అక్టోబర్ 26) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో ప్రతి సండే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కథా సుధలో భాగంగా ఆ చిన్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ ఆదివారం ఈ వరుసలోనే రిధి డిజిటల్ ప్రేక్షకులకు లవ్ ను పంచేందుకు వచ్చేసింది.
ఈటీవీ విన్ కథాసుధ
ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ రిధి రిలీజైంది. 4 టేల్స్ లో భాగంగా కథా సుధలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ షార్ట్ ఫిల్మ్. ఇందులో రావణ్ రెడ్డి, నిట్టూరె, చాందిని రావు తదితరులు నటించారు. దీనికి కిశోర్ గునాన డైరెక్టర్. కథాగ్ని పిక్చర్స్ పై కొత్తపల్లి సురేష్ ప్రొడ్యూస్ చేశాడు.
పెళ్లయ్యాక ప్రేమ
రిధి షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకునేలా ఉంది. మనసుకు హత్తుకునేలా ఉంది. పెళ్లయిన జంటలకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. వివాహం తర్వాత చాలా మంది దంపతులు ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఎడ మొహం, పెడ మొహంలా మారిపోతున్నారు. పెళ్లయిన తర్వాత ప్రేమగా ఎలా ఉండొచ్చు, లవ్ ఎంత ముఖ్యమనేది ఈ రిధి షార్ట్ ఫిల్మ్ లో చూపించారు.
రిధి ప్రేమలో కృష్ణ
కృష్ణ ఓ ఫొటోగ్రాఫర్. అతనికి రిధితో పెళ్లవుతుంది. కొన్నేళ్ల తర్వాత కూడా వీళ్లు ప్రేమగానే ఉంటారు. రిధి ప్రేమలో పడుతూనే ఉంటాడు కృష్ణ. ప్రతి రోజు కొత్తగా ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన ప్రేమకు టైమ్ తో సంబంధం లేదని, అది ఛాయిస్ తోనే ముడిపడి ఉంటుందని ఈ స్టోరీ చాటుతుంది.
{{/usCountry}}కృష్ణ ఓ ఫొటోగ్రాఫర్. అతనికి రిధితో పెళ్లవుతుంది. కొన్నేళ్ల తర్వాత కూడా వీళ్లు ప్రేమగానే ఉంటారు. రిధి ప్రేమలో పడుతూనే ఉంటాడు కృష్ణ. ప్రతి రోజు కొత్తగా ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన ప్రేమకు టైమ్ తో సంబంధం లేదని, అది ఛాయిస్ తోనే ముడిపడి ఉంటుందని ఈ స్టోరీ చాటుతుంది.
{{/usCountry}}ఈ ప్రపంచంలో అందమైన రెండు ఏంటో తెలుసా? ఒకటి నేచర్, రెండోది అమ్మాయిలు.. అంటూ కృష్ణ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈటీవీ విన్ ఓటీటీలోని రిధి మూవీ రోజులు గడుస్తున్నా కొద్దీ తగ్గిపోదు, ఇంకా బలంగా మారుతుందని చాటుతోంది.