...
...
Next Story

RJ Balaji: ఇలా జరగాల్సింది కాదు.. క్షమించండి అంటూ ఏడ్చేసిన డైరెక్టర్.. సూర్య మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో..

RJ Balaji: సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' సినిమా విడుదలకు ఆర్థిక అడ్డంకులు ఎదురయ్యాయి. మార్నింగ్ షోలు రద్దు కావడంతో డైరెక్టర్ ఆర్జే బాలాజీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Published on: May 14, 2026, 14:38:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

RJ Balaji: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, త్రిష హీరోయిన్‌గా నటించిన 'కరుప్పు' మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైన తరుణంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలతో థియేటర్లకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

RJ Balaji: ఇలా జరగాల్సింది కాదు.. క్షమించండి అంటూ ఏడ్చేసిన డైరెక్టర్.. సూర్య మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో..
RJ Balaji: ఇలా జరగాల్సింది కాదు.. క్షమించండి అంటూ ఏడ్చేసిన డైరెక్టర్.. సూర్య మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో..

ఈ సినిమా నిర్మాతలు గతంలో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలను సెటిల్ చేయకపోవడంతో విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమస్యల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ మార్నింగ్ షోలు, మధ్యాహ్నం షోలు పూర్తిగా రద్దయ్యాయి.

డైరెక్టర్ కన్నీటి పర్యంతం

సినిమా విడుదల ఆగిపోవడంతో కరప్పు మూవీ (తెలుగులో వీరభద్రుడు) దర్శకుడు ఆర్జే బాలాజీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఎమోషనల్ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఒక దర్శకుడిగా ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. దయచేసి మమ్మల్ని క్షమించండి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నీ సర్దుకుంటాయనే ఆశతో..

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. కనీసం ఈరోజు (మే 14) సాయంత్రం 6 గంటల షోకైనా సినిమా థియేటర్లలోకి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

"ఈ గందరగోళం వల్ల ప్రేక్షకులు పడుతున్న ఇబ్బందులకు నేను బాధ్యత వహిస్తున్నాను. సాయంత్రం లోపు సమస్యలన్నీ క్లియర్ అయ్యి సినిమా ప్రదర్శితం అవుతుందని నమ్ముతున్నాను" అని ఆయన వివరించారు.

నెటిజన్ల మద్దతు

ఆర్జే బాలాజీ అంతలా ఎమోషనల్ అవ్వడం చూసి సూర్య అభిమానులు, సాధారణ నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య-త్రిష కాంబోను వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు ఈ జాప్యం మింగుడుపడటం లేదు.

ప్రశ్న: 'కరుప్పు' సినిమా విడుదల ఎందుకు ఆలస్యమైంది?

జవాబు: నిర్మాతలకు సంబంధించిన పాత ఆర్థిక బకాయిల వల్ల ఈ సినిమా విడుదలకు సాంకేతిక, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి.

ప్రశ్న: కరప్పు సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

జవాబు: దర్శకుడు ఆర్జే బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు సాయంత్రం 6 గంటల షో నుండి సినిమా ప్రదర్శితం అయ్యే అవకాశం ఉంది.

ప్రశ్న: కరప్పు మూవీ తెలుగులో రిలీజ్ అవుతోందా?

జవాబు: అవును.. ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe