శోభనం జరిగే ముందు అయినా సరే నా భర్త గురించి ఏమైనా ఉంటే చెప్పండి.. నేను ఎవరినీ నమ్మను: చహల్ గర్ల్‌ఫ్రెండ్ మహ్వష్ వీడియో
క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడటం, మోసం ఆరోపణల నేపథ్యంలో ఆర్జే మహ్వష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె సెటైరికల్ గా చేసిన వీడియో సంచలనం రేపుతోంది.
క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం, ఆ తర్వాత పలాష్‌పై వచ్చిన 'మోసం' ఆరోపణల నేపథ్యంలో ఆర్జే మహ్వష్ చేసిన జోక్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. కొందరు ఈ వ్యాఖ్యను హాస్యాస్పదంగా భావించినప్పటికీ, చాలా మంది దీనిని పూర్తిగా సెన్స్ లేని పనిగా ఖండించారు.

ఆర్జే మహ్వష్ జోక్ వైరల్
బుధవారం (నవంబర్ 26) ఆర్జే మహ్వష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఆమె పలాష్‌పై వస్తున్న మోసం ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని చురకలు అంటించింది. స్మృతి తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా వీరి వివాహం వాయిదా పడినప్పటి నుండి పలాష్.. స్మృతిని మోసం చేశాడనే పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మహ్వష్ తన వీడియోలో మాట్లాడుతూ.. "మగవారు చాలా గొప్పవాళ్లు.. ఎప్పుడు అడిగినా సింగిల్‌గానే ఉంటారు" అని అనడం విశేషం.
"చూడండి భయ్యా.. నిజం ఏంటో, అబద్ధం ఏంటో నాకు తెలియదు. కానీ నా పెళ్లి జరిగే సమయంలో నేను ఇంటర్నెట్‌లో నా వరుడిని వారం ముందు పరిచయం చేయను. ఒకవేళ నావాడు ఎవరి డీఎంలలోనైనా శోభనం రాత్రి జరుపుకుంటుంటే, అమ్మాయిలూ దయచేసి వచ్చి నాకు చెప్పండి. 'ఓహ్, ఆమెకు పెళ్లి జరుగుతోంది, ఇప్పుడు ఈ వార్తను ఎలా బ్రేక్ చేస్తాం.. ఆమె అతనిని నమ్ముతుంటుంది' అని అనుకోవద్దు. నేను ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మను. 'ఈ వ్యక్తి ఎప్పటికీ ఇలా చేయలేడు' అని నేను ఎవరి గురించి చెప్పలేను. ఎవరైనా ఏదైనా చేయగలరు. మీరు అతని డీఎంలను పబ్లిక్ చేయండి. లేదా నాకు ఇవ్వండి. నేను పబ్లిక్ చేస్తాను. స్నాప్‌చాట్‌లో ఉంటే మరొక ఫోన్ నుండి రికార్డ్ చేయండి.. శోభనం రాత్రికి ముందు అయినా సరే పంపించండి.. నన్ను కాపాడండి స్నేహితులారా.. దయచేసి అమ్మాయిలూ.. ఈ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను" అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ రియాక్షన్ ఇలా..
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మహ్వష్ ఇలాంటి కామెంట్స్ చేయడం సెన్స్ లేని పనిగా చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఒక యూజర్ ఇలా రాశారు.. "ఈ రోజుల్లో మనుషులు ఎలా ఇంత సున్నితత్వం లేకుండా పోతున్నారు? మన దేశానికి ప్రపంచ కప్ తెచ్చిన వ్యక్తి గురించి, కేవలం వినోదం కోసం ఇలాంటి విషయాలపై జోక్ చేయడం దారుణం" అని అన్నారు.
మరొకరు స్పందిస్తూ.. "ప్రతిదానిపై డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రోజు రోజుకు మరింత దిగజారుతున్నారు" అని మండిపడ్డారు.
"విడాకులు జరగకముందే ఆమె (మహ్వష్) యుజి (యుజువేంద్ర చహల్)తో కనిపించింది. అలాంటి వ్యక్తి ఈ వీడియో చేయడం ఎంత ధైర్యం" అని ఒకరు విమర్శించారు.
స్మృతి తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా నవంబర్ 23న జరగాల్సిన పలాష్, స్మృతి వివాహం వాయిదా పడింది. అప్పటి నుండి పలాష్.. స్మృతిని మోసం చేశాడనే ఆరోపణలతో పుకార్లు పెరిగాయి. అయితే ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి ఊహాగానాలపై స్పందించకుండా మౌనం వహించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


