...
...
Next Story

Romanchakam Glimpse: రోమాంచకం గ్లింప్స్.. సందీప్ రెడ్డి వంగా స్టైల్ మేకింగ్.. సుమంత్ ప్రభాస్ రొమాంటిక్ మూవీ

Romanchakam Glimpse: సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రోమాంచకం మూవీ గ్లింప్స్ వీడియో రిలీజైంది. సుమంత్ ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా మేకింగ్ లో వంగా స్టైల్ కనిపిస్తోంది. ఆ వీడియో ఎలా ఉందో చూడండి.

Published on: Jul 6, 2026, 18:45:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Romanchakam Glimpse: యానిమల్ లాంటి వైల్డ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రూట్ మార్చాడు. 'మేమ్ ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్, 'మ్యాడ్' బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ లీడ్ రోల్స్‌లో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'రోమాంచకం' గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రోమాంచకం గ్లింప్స్

Romanchakam Glimpse: రోమాంచకం గ్లింప్స్.. సందీప్ రెడ్డి వంగా స్టైల్ మేకింగ్.. సుమంత్ ప్రభాస్ రొమాంటిక్ మూవీ
Romanchakam Glimpse: రోమాంచకం గ్లింప్స్.. సందీప్ రెడ్డి వంగా స్టైల్ మేకింగ్.. సుమంత్ ప్రభాస్ రొమాంటిక్ మూవీ

ఈ క్రేజీ ప్రాజెక్టును సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కే ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్ తో పాటు ఒక పాజిటివ్ వైబ్ ఆ పోస్టర్ క్రియేట్ చేసింది. ఈ టైటిల్ కు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ ఆసక్తి రేపింది.

ఇక ఇప్పుడు మేకర్స్ వదిలిన 'రోమాంచకం' గ్లింప్స్ అయితే విజువల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పవన్ పాప్పుల కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్ ను ఒక అందమైన పెయింటింగ్ లా మార్చేసింది. దీనికి తోడు వాసుకి వైభవ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) వింటుంటే ఒక కూల్ బ్రీజ్ ఫీల్ కలుగుతుంది.

చిన్న వీడియోతో పెద్ద ఇంపాక్ట్

సముద్రం బ్యాక్ డ్రాప్ లో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న రొమాన్స్, వాళ్ల మధ్య ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ ను ఈ చిన్న గ్లింప్స్ లోనే డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా వీడియో ఎండింగ్ లో వచ్చే ఆ చెంపదెబ్బ సీక్వెన్స్ ఆడియన్స్ పై గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కచ్చితంగా ఈ లవ్ స్టోరీలో ఏదో స్ట్రాంగ్ పాయింట్ ఉందని ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది.

రొమాన్స్, హ్యూమర్ తో పాటు చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లో యాడ్ చేశారట. కొత్త డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమానే అయినా రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ డ్రామాలను చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నట్లు ఈ చిన్న గ్లింప్స్ వీడియో చూస్తేనే అర్థమవుతోంది.

అసలే కొత్త కంటెంట్ ను ఎంకరేజ్ చేయడంలో వంగా బ్రదర్స్ ఎప్పుడూ ముందుంటారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వాళ్ల హోమ్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ పై టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మంచి హార్ట్ టచింగ్ ఎమోషన్స్, రిఫ్రెషింగ్ నెరేషన్ తో వస్తున్న ఈ 'రోమాంచకం' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks