Sandeep Reddy Vanga: మెగాస్టార్‌తో సందీప్ రెడ్డి వంగా ఊహించని కాంబో.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమా?.. చిరును డైరెక్షన్

Sandeep Reddy Vanga: ఓ వైపు మెగాస్టార్.. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. వీళ్ల కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.  ఆ ఊహ  నిజమయ్యే అవకాశం ఉంది.  చిరంజీవితో సినిమా తీస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పిన వీడియో ఒకటి తెగ వైరల్ గా మారింది. 

Published on: May 23, 2026, 19:14:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sandeep Reddy Vanga: సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు హిస్టరీ క్రియేట్ చేస్తాయి. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ఫ్యూచర్లో చూసే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవితో మూవీ తీస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పడం సంచలనంగా మారింది. ఈ వీడియో మాములూగా వైరల్ కావడం లేదు.

చిరంజీవితో మూవీ తీస్తానన్న సందీప్ రెడ్డి వంగా
చిరంజీవితో మూవీ తీస్తానన్న సందీప్ రెడ్డి వంగా

మెగాస్టార్ జోరు

సుదీర్ఘ కెరీర్, ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎంతో మందికి స్ఫూర్తి.. ఇదీ చిరంజీవి ఘన ప్రస్థానం. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీపడుతూ మెగాస్టార్ సినిమాలు తీస్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు.

చిరంజీవితో సినిమా

మరోవైపు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎంత బోల్డ్ గా, ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ను షేక్ చేశాడు సందీప్. తాజాగా చిరంజీవితో సినిమా తీయాలని ఉందని అతను పేర్కొన్నాడు.

ఫేవరేట్ నటుడు

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ న్యూస్ రిపోర్టర్ వచ్చి సందీప్ ను ఓ ప్రశ్న అడుగుతుంది. ‘‘నెక్ట్స్ ఏంటీ? మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు? ఫ్యూచర్ లో దర్శకత్వం వహించాలని అనుకునే యాక్టర్ ఎవరు’’ అని సందీప్ ను అడుగుతుంది. ‘‘చిరంజీవి’’ అని సందీప్ ఆన్సర్ చెప్తాడు. దీన్ని బట్టి చిరంజీవి- సందీప్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు.

స్పిరిట్ తో

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.

కొత్త మూవీ

ఇక మెగాస్టార్ జోరుమీదున్నారు. మన శంకర వర ప్రసాద్ గారుతో తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఇదే జోష్ లో సినిమాలు చేస్తున్నారు. తాజాగా బాబీ కొల్లి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో చిరు నటిస్తున్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమం తాజాగా జరిగింది. మరోవైపు చిరు మూవీ విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More