Prabhas Spirit: పంచెకట్టులో.. చేతిలో తుపాకీతో.. అదిరిపోయిన ప్రభాస్ లుక్.. స్పిరిట్ షూటింగ్ నుంచి ఫొటో లీక్.. వైరల్

Prabhas Spirit: సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ నుంచి అప్ డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఏకంగా ప్రభాస్ లుక్ కనిపిస్తే వదులుతారా? స్పిరిట్ షూటింగ్ నుంచి లీక్ అయిన ప్రభాస్ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Published on: May 15, 2026, 13:42:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas Spirit: పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో మూవీ అంటే మామూలుగా ఉంటుందా? అందుకే స్పిరిట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుత్తున్నాయి. తాజాగా ఆ మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిందన్నట్లు ప్రభాస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.

ప్రభాస్ (x)
ప్రభాస్ (x)

ప్రభాప్ లుక్ లీక్

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ స్పిరిట్. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ మూవీలో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తాడని సమాచారం. ఈ నేపథ్యంలో స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందనే వార్తలు జోరందుకున్నాయి. ఓ ఫొటో తెగ వైరల్ గా మారింది. స్పిరిట్ షూటింగ్ నుంచి లీక్ అయిన ప్రభాస్ ఫొటో ఇది అని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

పంచెకట్టులో

సోషల్ మీడియాలో మంట పెడుతున్న ఈ ఫొటోలో ప్రభాస్ పంచెకట్టులో అదిరిపోయాడు. వైట్ షర్ట్ వేసుకున్నాడు. చేతిలో గన్ తో అలా నడిచి వస్తున్నాడు. హైదరాబాద్ లోని కొంపల్లిలో స్పిరిట్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఆ షూటింగ్ నుంచే ప్రభాస్ ఈ లుక్ లీక్ అయిందిన అంటున్నారు. అయితే ఇది నిజంగానే లీక్ అయిన ఫొటోనా? లేదా ఫ్యాన్ మేడా అన్నదానిపై క్లారిటీ లేదు.

షూటింగ్ జోరు

స్పిరిట్ షూటింగ్ ను సందీప్ రెడ్డి వంగా పరుగులు పెట్టిస్తున్నాడు. ఏకంగా 60 రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేసిన సందీప్.. ఆ మేరకు మూవీలోని మేజర్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడని తెలిసింది. సందీప్ మూవీ అంటే వైలెన్స్, యాక్షన్ వేరే లెవల్ లో ఉంటాయి. ఈ స్పిరిట్ మూవీ అంతకుమించి ఉంటుందని సమాచారం.

రిలీజ్ డేట్

స్పిరిట్ మూవీని మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై స్పందించిన మేకర్స్.. షెడ్యూల్ ప్రకారమే స్పిరిట్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

వరుస సినిమాలు

ప్రభాస్ లైనప్ లో వరుస సినిమాలున్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్ జరుపుకొంటున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో ఫౌజీని రిలీజ్ చేసేందుకు ఆ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2027 మార్చిలో స్పిరిట్ రానుంది. 2027 డిసెంబర్ లో కల్కి 2 రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇలా వరుసగా క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More