Romanchakam Trailer: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పూర్తి డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'భద్రకాళి పిక్చర్స్' బ్యానర్‌పై సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ రోమ్‌కామ్ 'రోమాంచకం' మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
రోమ్‌కామ్ డోస్ పెంచేసిన భద్రకాళి పిక్చర్స్

సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి వైలెంట్ యాక్షన్, డార్క్ క్యారెక్టరైజేషన్స్. కానీ ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ చాలా ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.
'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రామిసింగ్ పర్‌ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైన సుమంత్ ప్రభాస్.. ఈ రోమాంచకం చిత్రంలో లీడ్ రోల్ చేశారు. యూత్ ఫేవరెట్ అనంతిక సానిల్‌కుమార్ హీరోయిన్‌గా అలరించబోతోంది. డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. లవ్, హ్యూమర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందించారు.
డేటింగ్ యాప్ స్టార్టప్.. చెన్నై లవ్ స్టోరీ
ఈ సినిమా కాన్సెప్ట్ నేటి యంగ్ జనరేషన్ మైండ్‌సెట్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఉంది. హీరో ఒక డేటింగ్ యాప్ సర్వీస్ ఇచ్చే పక్కా యూత్‌ఫుల్ స్టార్టప్‌ను రన్ చేస్తుంటాడు. ఆ బిజినెస్ రీసెర్చ్ పనిలో భాగంగా చెన్నైకి చెందిన హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌లో పడతాడు.
అయితే హీరో, అతని గ్యాంగ్ చేసే అల్లరి, ఊహించని పరిస్థితుల వల్ల ఎదురయ్యే సమస్యలు కథను తీవ్రమైన ట్విస్టుల వైపు తీసుకెళ్తాయి. హీరో, హీరోయిన్ మధ్య ఉండే విభేదాలు, ఫన్నీ ఎపిసోడ్స్ ఆడియన్స్‌కు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ ఇస్తున్నాయి. ఇక చివర్లో తన స్టోరీ రాస్తే రామాయణం, తీస్తే రోమాంచకం అని హీరో క్యారెక్టర్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
రక్తం చిందించే ఫార్ములాను పక్కన పెట్టి..
ఇప్పటివరకు భద్రకాళి పిక్చర్స్ అందించిన ప్రతీ సినిమా ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సినిమాల్లో రక్తం ఏరులై పారే యాక్షన్ కామన్ ఎలిమెంట్. కానీ ఈసారి పూర్తిగా క్లీన్ అండ్ హ్యాపీ యూత్‌ఫుల్ రోమ్‌కామ్ ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
{{/usCountry}}ఇప్పటివరకు భద్రకాళి పిక్చర్స్ అందించిన ప్రతీ సినిమా ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సినిమాల్లో రక్తం ఏరులై పారే యాక్షన్ కామన్ ఎలిమెంట్. కానీ ఈసారి పూర్తిగా క్లీన్ అండ్ హ్యాపీ యూత్‌ఫుల్ రోమ్‌కామ్ ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
{{/usCountry}}కలర్‌ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్, క్యాచీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి పెద్ద ప్లస్ కానున్నాయి. పక్కా లోకల్ కామెడీ టైమింగ్, యూత్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్స్ పైకి..
ఈ ఫ్రెష్ కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఎక్కడా తగ్గకుండా ఫుల్ ఎనర్జీతో రాబోతోంది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరినీ నవ్వించేలా డిజైన్ చేసిన 'రోమాంచకం' థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది.
అన్ని రకాల హంగులతో సిద్ధమైన ఈ మూవీ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ వంగా ప్రెజెంటేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.