...
...
Next Story

ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ మూవీ-స్టెప్ బ్ర‌ద‌ర్‌, సిస్ట‌ర్ రిలేష‌న్‌షిప్‌-బోల్డ్ సీన్లు-పెద్ద‌వాళ్ల‌కు మాత్ర‌మే

ఓటీటీని ఓ రొమాంటిక్ మూవీ షేక్ చేస్తోంది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారింది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రం కేవలం పెద్దవాళ్లకు మాత్రమే.

Published on: Oct 18, 2025, 19:04:51 IST
Advertisement

ఓటీటీలో రొమాంటిక్ అడల్ట్ మూవీ ‘అవర్ ఫాల్ట్’ సంచలనంగా మారింది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ లో ఇదే లాస్ట్, మూడో మూవీ. అయితే ఈ సినిమా కేవలం పెద్దవాళ్లకు మాత్రమే. ఎందుకంటే ఇందులో శ్రుతి మించిన మోతాదులో న్యూడ్, కిస్, రొమాన్స్ సీన్లున్నాయి.

అవర్ ఫాల్ట్ ఓటీటీ

ఓటీటీ ట్రెండింగ్ లో రొమాంటిక్ మూవీ (youtube)
ఓటీటీ ట్రెండింగ్ లో రొమాంటిక్ మూవీ (youtube)

స్పానిష్ రొమాంటిక్ ఫిల్మ్ అవర్ ఫాల్ట్ ఓటీటీలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీ అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సినిమా. కల్పబుల్స్ పుస్తక ట్రైలజీలో ఇది లాస్ట్ పార్ట్. మెర్సడెస్ రాన్ రాసిన ఈ బుక్ ఆధారంగా ఇప్పటికే మై ఫాల్ట్ (2023), యువర్ ఫాల్ట్ (2024) సినిమాలొచ్చాయి. ఇప్పుడు లాస్ట్ పార్ట్ అవర్ ఫాల్ట్ రిలీజైంది.

గ్లోబల్ ట్రెండ్

రెండు రోజుల క్రితం ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజైన అవర్ ఫాల్ట్ మూవీ గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్ ట్రెండింగ్ నంబర్ వన్ లో ఉంది ఈ సినిమా. అలాగే ఇండియాలోనూ టాప్ లో ప్లేస్ అయింది. ఈ రొమాంటిక్ మూవీ ఇంగ్లీష్, స్పానిష్ తదితర ప్రపంచ భాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

నికోల్ వాలాస్, గాబ్రియల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన అవర్ ఫాల్ట్ సినిమాకు డొమింగో గొంజాలెజ్ డైరెక్టర్. స్టెప్ బ్రదర్, సిస్టర్ రిలేషన్ షిప్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సవతి తల్లి కూతురు, సవతి తండ్రి కొడుకు మధ్య లవ్ ఉంటుంది. ఓ వైపు ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నా మరో వైపు ట్రెండ్ అవుతూనే ఉంది.

నాలుగేళ్ల తర్వాత

మరి ఈ స్టెప్ బ్రదర్, సిస్టర్ లవ్ స్టోరీ కంచికి చేరిందా? పెళ్లి చేసుకున్నారా? అన్నది తెలియాలంటే మూవీ చూడాలి. ఈ మూవీ స్ట్రిక్ట్ లీ పెద్దవాళ్లకు మాత్రమే అనే విషయం మర్చిపోవద్దు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks