...
...
Next Story

Web Series: నలుగురు ఫ్రెండ్స్.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్.. ఓటీటీలో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. 7.5 రేటింగ్

Web Series: వీకెండ్‌లో మంచి ఫ్రెండ్షిప్, ఆధునిక జీవితం, రిలేషన్‌షిప్ తో కూడిన ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ చూడాలనుకునే వారికి 'బ్రోచారా' (Brochara) ఒక అద్భుతమైన ఆప్షన్. ఒకే ఆఫీసులో పనిచేస్తూ, తమ జీవితంలోని ప్రతి కష్టసుఖాన్ని పంచుకునే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ ఎంతో సహజంగా, హాస్యభరితంగా సాగుతుంది.

Published on: Nov 23, 2026, 12:05:21 IST
Advertisement

Web Series: వారం రోజుల పాటు ఆఫీస్ పని ఒత్తిడితో అలసిపోయిన తర్వాత, వీకెండ్‌లో మనసుకు హాయినిచ్చే ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రక్తపాతం, క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా స్నేహం, యువత జీవితంలోని సవాళ్లు, ప్రేమ బంధాలను ఎంతో సహజంగా ఆవిష్కరించే అలాంటి ఒక అద్భుతమైన హిందీ వెబ్ సిరీస్ 'బ్రోచారా' (Brochara).

Web Series: నలుగురు ఫ్రెండ్స్.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్.. ఓటీటీలో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. 7.5 రేటింగ్
Web Series: నలుగురు ఫ్రెండ్స్.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్.. ఓటీటీలో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. 7.5 రేటింగ్

ఐఎండీబీ (IMDb)లో 7.5 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు సీజన్లలో కలిపి మొత్తం 10 ఎపిసోడ్లు మాత్రమే ఉండటం వల్ల ఒక్క పూటలోనే దీనిని సులభంగా బింజ్ వాచ్ చేయవచ్చు.

అసలు కథేంటి? నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణం

ఒకే ఆఫీసులో పనిచేసే నలుగురు యువకుల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహం చుట్టూ 'బ్రోచారా' కథ తిరుగుతుంది. ఆఫీస్ పనుల నుంచి వ్యక్తిగత సమస్యల వరకు ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడే తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

మొదటి సీజన్ కన్ను, శివాశిష్, ప్రణయ్, ధీరెన్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ సాగుతుంది. వీరు ఒకే ఆఫీసులో పనిచేయడమే కాకుండా, రోజూ కలిసే ఆఫీసుకు వెళ్లి వస్తుంటారు. సాయంత్రం వేళల్లో సరదాగా గడుపుతుంటారు. విశేషమేమిటంటే ఈ నలుగురూ వేర్వేరు నగరాల్లో ఉన్న తమ ప్రేయసిలతో 'లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్' లో ఉంటారు. ఆ దూరం వల్ల వచ్చే అపార్థాలు, భావోద్వేగాలను స్నేహితుల సాయంతో ఎలా అధిగమించారనేది ఇందులో ఎంతో సరదాగా చూపించారు.

మరోవైపు శివాశిష్ తన తండ్రి వద్ద ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టడం వల్ల అతని ప్రేమ జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. ఇక ఏ రిలేషన్‌షిప్‌లోనూ లేని అభిమన్యు ఒంటరితనంతో బాధపడుతుండగా, మిగతా ముగ్గురు స్నేహితులు అతనికి అండగా నిలిచే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి.

బ్రోచారా వెబ్ సిరీస్ విశేషాలు

ఈ వెబ్ సిరీస్‌లో అమేయ్ వాఘ్, సయన్దీప్ సేన్‌గుప్తా, వరుణ్ తివారీ, ధ్రువ్ సెహగల్, అంకుర్ రాఠీ, సియా మహాజన్, తరుణ్ ఖేమ్, నిషిత్ బ్రోకర్ తదితరులు అద్భుతంగా నటించారు. మొదటి సీజన్‌కు సిమర్‌ప్రీత్ సింగ్ దర్శకత్వం వహించగా, రెండో సీజన్‌ను దివ్యాంశు మల్హోత్రా తెరకెక్కించారు.

నిడివి విషయానికొస్తే, సీజన్ 1లో 5 ఎపిసోడ్లు ఉండగా ఒక్కో ఎపిసోడ్ కేవలం 15 నుంచి 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సీజన్ 2లోని 5 ఎపిసోడ్లు 23 నుంచి 30 నిమిషాల నిడివితో సాగుతాయి. ఎలాంటి బోర్ కొట్టకుండా, మన ఆఫీస్, కాలేజీ స్నేహితులను గుర్తుచేసే ఈ సిరీస్‌ను ఈ వీకెండ్‌లో జియోహాట్‌స్టార్‌లో అస్సలు మిస్ కావద్దు.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks