Saif Ali Khan Attack: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి- కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్- కోర్టులో సాక్ష్యం చెప్పిన నర్స్

Saif Ali Khan Home Intruder Case Nurse: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్ నివాసంలో జరిగిన దొంగతనం, భయానక దాడి కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. ముంబై కోర్టులో హాజరైన చిన్న కుమారుడు జేహ్ ఆయా (నర్స్).. ఆ రాత్రి జరిగిన దారుణాలను కళ్లకు కట్టినట్లు వివరించింది.

Published on: Oct 25, 2026, 12:00:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Saif Ali Khan Home Intruder Case Nurse: ముంబైలోని విలాసవంతమైన బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివాసంలోకి చొరబడి దాడి చేసిన ఉదంతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ ముంబై న్యాయస్థానంలో వేగవంతమైంది.

దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి- కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్- కోర్టులో సాక్ష్యం చెప్పిన నర్స్
దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి- కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్- కోర్టులో సాక్ష్యం చెప్పిన నర్స్

సైఫ్ చిన్న కుమారుడు

దాడికి పాల్పడిన నిందితుడిని బాధితురాలు, సైఫ్ చిన్న కుమారుడు జేహ్ సంరక్షకురాలైన 59 ఏళ్ల నర్స్ (ఆయా) కోర్టులో స్పష్టంగా గుర్తుపట్టింది. గత ఐదేళ్లుగా సైఫ్ కుటుంబం వద్ద పనిచేస్తున్న సదరు నర్సే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు కావడం గమనార్హం. న్యాయమూర్తి సమక్షంలో ఆ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనను ఆమె వివరించింది.

అర్ధరాత్రి 2 గంటల భయానక దృశ్యం

ఆ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూమ్ లైట్ వెలుగుతుండటంతో కరీనా కపూర్ ఏమోనని భావించినట్లు ఆయా తెలిపింది. అయితే కొద్దిసేపటికే ఒక అపరిచిత వ్యక్తి చిన్నారి జేహ్ బెడ్ వైపు అడుగులు వేయడం ఆమె గమనించింది. ప్రమాదాన్ని గ్రహించి చిన్నారిని ఎత్తుకునేందుకు పరుగెత్తగా.. ఆ వ్యక్తి హ్యాక్సా బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు.

"కోటి రూపాయలు ఇవ్వు" అని నిందితుడు అరుస్తు బెదిరించాడని సదరు నర్స్ కోర్టులో వెల్లడించింది. ఆ అలజడికి జేహ్ సంరక్షణ బాధ్యతలు చూసే మరొక ఆయా కూడా లేచి కేకలు వేసింది. ఆ శబ్దాలు విన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వెంటనే గదిలోకి వచ్చారు.

గాయపడినా ఎదురొడ్డిన సైఫ్

ముందుకొచ్చిన నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై కూడా బ్లేడ్‌తో దొంగ దాడికి తెగబడ్డాడు. ఇంటి సిబ్బందిపై కూడా నిందితుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. సైఫ్ ధైర్యంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే.. మిగతా సిబ్బంది పిల్లలను పక్క గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నారు.

"నేను చనిపోతాననే అనుకున్నా": సైఫ్ భావోద్వేగం

ఈ లోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన సైఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఉదంతంపై సైఫ్ అలీ ఖాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. "తెల్లటి కుర్తా పైజామా మొత్తం రక్తంతో తడిసిపోయింది. నేలపై పడిపోయిన ఆ క్షణంలో నేను చనిపోతాననే అనుకున్నా" అని సైఫ్ పేర్కొన్నారు.

ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో తన పెద్ద కుమారుడు తైమూర్ దగ్గరకు వచ్చి.. "నాన్నా.. నువ్వు చనిపోతావా?" అని అడిగిన ప్రశ్న తన మనసును కలిచివేసిందని గుర్తుచేసుకున్నారు. సమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలే ఇలాంటి నేరాలకు కారణమవుతున్నాయని, నిందితుడిని క్షమించాలనిపించినా తనను చంపాలని చూడటాన్ని మాత్రం ఒప్పుకోలేకపోయానని దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.

కుమారులతో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ (PTI)
కుమారులతో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ (PTI)

రెండుసార్లు నేరం అంగీకరించినా విచారణ కొనసాగింపు

ఘటన జరిగిన మూడు రోజులకే ముంబై పోలీసులు 31 ఏళ్ల నిందితుడు మహమ్మద్ షరీఫుల్‌ను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించేందుకు రెండుసార్లు కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. చట్టప్రకారమే పూర్తి స్థాయి విచారణ జరిపి శిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఇచ్చిన సాక్ష్యంతో నిందితుడికి శిక్ష ఖాయమని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More