Saif Sons: మతంపై కరీనా కపూర్ పిల్లలకు అవగాహన- తొమ్మిదేళ్ల కొడుకు ఇచ్చిన ఆన్సర్‌కు సైఫ్ అలీ ఖాన్ షాక్- లండన్‌లో ఓపెన్!

Saif Ali Khan Teaches Religion To Taimur Jeh: స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ పిల్లలైన తైమూర్, జెహంగీర్‌లను పెంచుతున్న తీరుపై సైఫ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భిన్న మతాల నేపథ్యం ఉన్న తమ ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే సర్వమత సమానత్వాన్ని అలవాటు చేస్తున్నట్లు లండన్ వేదికగా వివరించారు.

Published on: Jun 29, 2026, 12:34:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Saif Ali Khan Teaches Religion To Taimur Jeh: బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ దంపతులు తమ పిల్లల పెంపకం విషయంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. భిన్న సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న ఈ స్టార్ కుటుంబంలో పిల్లలను ఎలా పెంచుతున్నారనే దానిపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.

మతంపై కరీనా కపూర్ పిల్లలకు అవగాహన- తొమ్మిదేళ్ల కొడుకు ఇచ్చిన ఆన్సర్‌కు సైఫ్ అలీ ఖాన్ షాక్- లండన్‌లో ఓపెన్!
మతంపై కరీనా కపూర్ పిల్లలకు అవగాహన- తొమ్మిదేళ్ల కొడుకు ఇచ్చిన ఆన్సర్‌కు సైఫ్ అలీ ఖాన్ షాక్- లండన్‌లో ఓపెన్!

అంతర్జాతీయ సదస్సులో

తాజాగా సైఫ్ అలీ ఖాన్ లండన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, తమ కుమారులు తైమూర్, జెహంగీర్ (జెహ్)లకు మతం, దేవుడి పట్ల తాము కల్పిస్తున్న అవగాహనపై మనసు విప్పి మాట్లాడారు.

దేవుడు ఒక్కడే.. పేర్లు మాత్రమే వేరు

పిల్లలతో దేవుడు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం తనకు ఎంతో ఇష్టమైన విషయమని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. తాను వ్యక్తిగతంగా అంతగా మతాచారాలను పాటించే వ్యక్తినేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

"దేవుడు ఒక్కడే, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్నే మా అమ్మ నాకు నేర్పించింది, నేను నా పిల్లలకు చెబుతున్నాను. విషయం చాలా స్పష్టం. మనం వేర్వేరు ప్రదేశాల్లో ఆ దేవుడిని ప్రార్థిస్తాం. మీ మతం గనక తోటి మానవుల పట్ల ప్రేమ, క్షమాగుణాన్ని నేర్పిస్తే, అంతకంటే కావాల్సింది ఏమీ లేదు" అని సైఫ్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

హిందూ కుటుంబానికి చెందినవారైనా

సైఫ్ అలీ ఖాన్ మాతృమూర్తి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ హిందూ కుటుంబానికి చెందినవారైనా, పటౌడీ నవాబును వివాహం చేసుకున్నారు. అలాగే సైఫ్ భార్య కరీనా కపూర్ కూడా క్రైస్తవ, హిందూ సంస్కృతుల కలయిక ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఈ వైవిధ్యాన్ని పిల్లలు గౌరవించేలా పెంచుతున్నట్లు సైఫ్ చెప్పారు.

తాను చిన్నప్పుడు క్రైస్తవ విద్యాసంస్థల్లో చదువుకున్నానని, అక్కడ ప్రతిరోజూ చర్చి ప్రార్థనలతోనే క్లాసులు మొదలయ్యేవని గుర్తుచేసుకున్నారు. తమ ఇంట్లో దీపావళిని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటారో, క్రిస్మస్‌ను కూడా అంతే ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తామని సైఫ్ వెల్లడించారు.

తొమ్మిదేళ్ల తైమూర్ సమాధానానికి సైఫ్ షాక్!

తన పెద్ద కుమారులు తైమూర్‌తో ఇటీవల జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను సైఫ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. మతానికి (Religion), పురాణాలకు (Mythology) మధ్య ఉన్న తేడా ఏంటని తాను తైమూర్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు.

"మతంలో మనం దేవుడిని ప్రార్థిస్తాం, కానీ పురాణాల్లో అలా ప్రార్థించం అని తొమ్మిదేళ్ల తైమూర్ సమాధానం ఇచ్చాడు. ఆ చిన్న వయసులో వాడు చెప్పిన పరిణతి గల సమాధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని సైఫ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇలాంటి విషయాల గురించి తాము ఇంట్లో నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంటామని సైఫ్ వివరించారు. తన తల్లి సంకుచిత ఆలోచనలు లేని విశాల హృదయురాలని, తన భార్య కరీనా కపూర్ కూడా అలాగే ఆలోచిస్తుందని చెప్పారు. అందుకే తమ ఇంట్లో పిల్లల పెంపకం కఠినమైన మతాచారాల కంటే ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణంలోనే సాగుతుందని స్పష్టం చేశారు.

సైఫ్, కరీనా ప్రేమాయణం

ఇకపోతే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2007-08లో 'తషాన్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2012 అక్టోబర్ 16న ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరికి తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సినిమాల విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం 'హమ్ హిందుస్తానీ' సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, దీపక్ డోబ్రియాల్, మీమి చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

నేరుగా ఓటీటీలోకి

హమ్ హిందుస్తానీ సినిమా ఈ ఏడాది (2026) చివరలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల కానుంది. దీనితో పాటు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హైవాన్' సినిమాలోనూ సైఫ్ నటిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, సయామీ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సైఫ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ కర్తవ్య నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More