Sai Pallavi: నా చిన్నప్పటి రాముడిని మళ్లీ చూసే సరికి షాక్ అయ్యా.. రణ్‌బీర్ గురించి సాయిపల్లవి కామెంట్స్ వైరల్
Sai Pallavi: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ను రాముడి గెటప్ లో చూసి షాక్ అయ్యానని సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'రామాయణం' నుంచి మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Sai Pallavi: ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ 'రామాయణం'. ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో శ్రీరాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ పడిన శ్రమ, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, కత్తిసాము, విలువిద్య సాధన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇదో పెద్ద బాధ్యత
"నాకు శ్రీరాముడి పాత్ర లభించడం కేవలం ఒక సినిమా ఆఫర్ మాత్రమే కాదు. ఇది కోట్ల మంది నమ్మకానికి, భావోద్వేగానికి సంబంధించిన ఒక పెద్ద బాధ్యత" అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ టెర్రీ నోటరీ ఆధ్వర్యంలో రణ్‌బీర్ ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన యాక్షన్ అండ్ స్టంట్ శిక్షణ పొందాడు.
సాయి పల్లవి ఎమోషనల్
ఈ రామాయణం చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి.. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి లుక్, నటనపై పంచుకున్న విషయాలు ఆకట్టుకుంటున్నాయి. "చిన్నతనం నుంచి నా మనసులో ఉన్న శ్రీరాముడి రూపం, అమాయకత్వం.. ఇవన్నీ రణ్‌బీర్‌లో చూసి షాక్ అయ్యా. నా చిన్ననాటి రాముడు నా కళ్లముందే నిలబడినట్లు అనిపించింది" అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ ఏమన్నారంటే?
దర్శకుడు నితేష్ తివారీ మాట్లాడుతూ.. ‘‘రామాయణం వంటి పవిత్రమైన ఇతిహాసాన్ని తెరకెక్కించేటప్పుడు సరైన నటీనటులను ఎంచుకోవడమే అత్యంత కీలకం. ప్రజల నమ్మకానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు.
2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ గ్రాండ్ రిలీజ్
నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ దిగ్గజం DNEG, కన్నడ రాకింగ్ స్టార్ యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ బిగ్ బడ్జెట్ విజన్ సరిహద్దులను చెరిపేస్తోంది.
ఇందులో రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఇంకా అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కుణాల్ కపూర్, కాజల్ అగర్వాల్ కూడా ముఖ్యం పాత్రలు పోషిస్తున్నారు.
ఈ భారీ చిత్రం రామాయణం మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గ్లోబల్ విజువల్ వండర్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ, నితేష్ తివారీ-నమిత్ మల్హోత్రా కాంబినేషన్ దీనిని హాలీవుడ్ విజువల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్తోంది. ఆస్కార్ విన్నింగ్ VFX సంస్థ DNEG భాగస్వామ్యం, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల శిక్షణ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తాయి.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి నటుల ఎంపిక కేవలం పాన్-ఇండియా మార్కెట్ కోసమే కాకుండా పాత్రల తీవ్రతకు తగ్గట్టుగా జరగడం విశేషం. 2026 దీపావళి బరిలో నిలవబోతున్న ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


