సాయి పల్లవి హిందీ మూవీ టీజర్ వచ్చేసింది.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. ఆమె హిందీ విని ఫిదా అవుతున్న ఫ్యాన్స్

సాయి పల్లవి నటించిన తొలి హిందీ మూవీ ఏక్ దిన్ టీజర్ రిలీజైంది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన ఈ రొమాంటిక్ డ్రామాలో ఆమె చాలా క్యూట్ గా కనిపించడంతోపాటు హిందీ డైలాగ్ తోనూ అదరగొడుతోంది.

Published on: Jan 16, 2026, 13:57:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌత్ ప్రేక్షకులను తన సహజమైన నటన, డ్యాన్స్‌తో మాయ చేసిన ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్‌నిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో, అతని కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ (Ek Din). ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తించగా, తాజాగా శుక్రవారం (జనవరి 16) మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

సాయి పల్లవి హిందీ మూవీ టీజర్ వచ్చేసింది.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. ఆమె హిందీ విని ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (Screenshot from YouTube/ @Aamir Khan Talkies)
సాయి పల్లవి హిందీ మూవీ టీజర్ వచ్చేసింది.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. ఆమె హిందీ విని ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (Screenshot from YouTube/ @Aamir Khan Talkies)

మనసు గెలుచుకునే మ్యాజిక్..

జునైద్ ఖాన్, సాయి పల్లవి మధ్య నడిచే స్వచ్ఛమైన, మృదువైన ప్రేమకథను ఈ ఏక్ దిన్ మూవీ టీజర్‌లో చూపించారు. జునైద్ చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. "మీరా.. నీ నవ్వు నాకు చాలా ఇష్టం. నేను నీ మనసు గెలుస్తానో లేదో తెలియదు.. కానీ, అందనంత దూరంలో ఉంటే అవి కలలు ఎలా అవుతాయి?" అని జునైద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

మరో సీన్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.. "సినిమాల్లో చాలా మ్యాజిక్ ఉంటుంది.. కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా" అని నిరాశగా అంటుంది. దానికి జునైద్ బదులిస్తూ.. "జరుగుతుంది.. ఆ మాయ జరుగుతుంది" అని భరోసా ఇస్తాడు. ఈ సంభాషణలు సినిమాలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని పరిచయం చేస్తున్నాయి.

సాయి పల్లవి హిందీకి నెటిజన్లు ఫిదా

టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా సాయి పల్లవి హిందీ ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "సాయి పల్లవి హిందీ మాట్లాడటం ఇదే తొలిసారి వింటున్నా.. ఆమె చాలా స్పష్టంగా, క్యూట్‌గా మాట్లాడుతోంది" అని ఒకరు యూట్యూబ్‌లో కామెంట్ చేశారు.

జునైద్ లుక్స్ గురించి స్పందిస్తూ.. "జునైద్ చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు" అని మరొకరు రాసుకొచ్చారు. "జునైద్ నటన బాగుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది" అని ఇంకొకరు మెచ్చుకున్నారు.

ఏక్ దిన్.. థాయ్ రీమేక్?

టీజర్ చూస్తుంటే ఇది థాయ్ సూపర్ హిట్ మూవీ ‘వన్ డే’ (One Day) రీమేక్‌లా అనిపిస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్నేహ దేశాయ్, స్పందన్ మిశ్రా రచన అందించారు. మే 1, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

రామాయణం కంటే ముందే..

నిజానికి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayana)తో జరుగుతుందని అందరూ భావించారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. కానీ అంతకంటే ముందే ‘ఏక్ దిన్’తో ఆమె హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న రామాయణం రెండు భాగాలుగా రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More