Sai Pallavi: రావణుడు పూర్తిగా చెడ్డోడు కాదు.. మనందరిలోనూ ఉన్న రావణుడిని గుర్తించాలి: సాయి పల్లవి

Sai Pallavi: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో మోస్ట్ అవేటెడ్ మైథాలజికల్ ఎపిక్ 'రామాయణ' (Ramayana) గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ ఘనంగా జరిగింది. ఈ రెడ్ కార్పెట్ వేడుకలో పాల్గొన్న సాయి పల్లవి.. రావణాసురుడి పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Oct 28, 2026, 17:49:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారతీయ మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎపిక్ ప్రాజెక్ట్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో చిత్రబృందం గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ ను నిర్వహించింది.

రావణుడిపై సాయి పల్లవి సంచలన కామెంట్స్
రావణుడిపై సాయి పల్లవి సంచలన కామెంట్స్

ఈ రెడ్ కార్పెట్ వేడుకలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి, రావణాసురుడిగా నటిస్తున్న కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శకుడు నితేష్ తివారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన సాయి పల్లవి, రామాయణ ఇతిహాసం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

"మనలోని రావణుడిని గుర్తించడమే అసలైన రామాయణం!"

లాస్ ఏంజెల్స్ ప్రదర్శనలో విదేశీ మీడియా ప్రతినిధులు సాయి పల్లవిని ప్రశ్నిస్తూ.. "భారతీయులకు రామాయణం గురించి చిన్నప్పటి నుంచే తెలుసు. కానీ అమెరికా లేదా విదేశీ ఆడియెన్స్ ఈ సినిమా ద్వారా కొత్తగా ఏం గ్రహిస్తారని మీరు భావిస్తున్నారు?" అని అడిగారు.

దానికి సాయి పల్లవి స్పందిస్తూ.. "భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, ఇప్పటివరకు వచ్చిన రామాయణ రూపాల్లో అత్యుత్తమ దృశ్య రూపం ఈ సినిమానే అవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) సాంకేతికతతో ఈ సినిమాను రూపొందించాం. అయితే సాంకేతికత కంటే ముఖ్యంగా ఒక పవిత్ర గ్రంథంగా రామాయణాన్ని చూస్తే.. ప్రతి ఒక్కరూ తమలోని మంచిని, చెడును ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది" అని అన్నారు.

ముఖ్యంగా రావణాసురుడి పాత్ర గురించి చెబుతూ.. “రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. ఆయనలో ఎంతో జ్ఞానం, మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనలో దాగి ఉన్న రావణుడిని (మనలోని చెడు ఆలోచనలను) మనం గుర్తించి, కాలక్రమేణా ఆ తప్పులను సరిదిద్దుకోవడమే అత్యంత ముఖ్యం. ఈ సినిమా చూశాక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాను” అని సాయి పల్లవి విశ్లేషించారు.

రూ. 4000 కోట్ల వండర్: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం

నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ ఎపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 4000 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హన్స్ జిమ్మర్ (Hans Zimmer) కలిసి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం విశేషం.

ఇందులో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మొదటి భాగం వచ్చే నవంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More