బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పుట్టినరోజు సందర్భంగా అతని ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సల్మాన్.. ఇప్పుడు రూ. 2900 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. అతనికున్న లగ్జరీ ఇళ్లు, ఫామ్‌హౌస్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సల్మాన్ ఖాన్.. ఆస్తుల్లోనూ టాప్

1988లో 'బీవీ హో తో ఐసీ' సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1989లో 'మైనే ప్యార్ కియా'తో స్టార్ హీరోగా ఎదిగిన సల్మాన్ ఖాన్ నేడు కోట్లకు అధిపతి. శనివారం (డిసెంబర్ 27) అతని పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఆస్తుల చిట్టా ఓసారి చూద్దాం.
తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 2900 కోట్లు. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న నటుల్లో సల్మాన్ ఒకరు. ఎన్నో లగ్జరీ ప్రాపర్టీలు అతని సొంతం.
సల్మాన్ లగ్జరీ ఆస్తులు ఇవే..
1. గెలాక్సీ అపార్ట్‌మెంట్ (ముంబై): సల్మాన్ ఖాన్ ఎప్పటినుంచో తన కుటుంబంతో కలిసి ఉంటున్న ఇల్లు ఇదే. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ ఉండేది కేవలం 1 బీహెచ్‌కే ఫ్లాట్‌లో మాత్రమే కావడం విశేషం. మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం దీని విలువ రూ. 16 కోట్లు.
2. పన్వేల్ ఫామ్‌హౌస్: సల్మాన్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది ఇక్కడే. ఇది ఏకంగా 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, గుర్రపు శాలలు, గెస్ట్ బంగళాలు ఉన్నాయి. దీని విలువ సుమారు రూ. 80 కోట్లు. సెలబ్రిటీల పార్టీలన్నీ ఇక్కడే జరుగుతుంటాయి.
3. గొరై బీచ్ హౌస్: సల్మాన్‌కు ఉన్న మరో లగ్జరీ ప్రాపర్టీ ఇది. ఇందులో ప్రైవేట్ థియేటర్, బైక్ ఎరేనా, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. దీని విలువ ఏకంగా రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
{{/usCountry}}3. గొరై బీచ్ హౌస్: సల్మాన్‌కు ఉన్న మరో లగ్జరీ ప్రాపర్టీ ఇది. ఇందులో ప్రైవేట్ థియేటర్, బైక్ ఎరేనా, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. దీని విలువ ఏకంగా రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
{{/usCountry}}4. ట్రిపుల్స్ అపార్ట్‌మెంట్ (బాంద్రా): బాంద్రాలో సల్మాన్‌కు 3 అంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్‌మెంట్ కూడా ఉంది. 4 బెడ్‌రూమ్స్ ఉన్న ఈ విలాసవంతమైన ఫ్లాట్ విలువ రూ. 30 కోట్లు.
5. దుబాయ్ అపార్ట్‌మెంట్: దుబాయ్‌లోని ఫేమస్ 'ది అడ్రస్ డౌన్‌టౌన్' (The Address Downtown)లో కూడా సల్మాన్‌కు ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్ ఉంది.
సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టిన రోజు వేడుకలను ఒక రోజు ముందే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 26) రాత్రి అతని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీకి ధోనీతోపాటు ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు.