సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను ఎవరూ వదులుకోరు. కానీ సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమాను మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 30 మంది నటులు రిజెక్ట్ చేశారు. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇందులో సల్మాన్‌తో పాటు ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా నటించారు. అయితే వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించరు. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర చివరికి చనిపోతుంది.
ఆ సినిమా పేరేంటో తెలుసా?

సల్మాన్ ఖాన్ ఓ ఎయిడ్స్ పేషెంట్ లా కనిపించిన ఆ సినిమా పేరు ‘ఫిర్ మిలేంగే’ (Phir Milenge). 2004లో బ్లాక్ బస్టర్ సినిమా ‘ధూమ్’ విడుదలైన సమయంలోనే ఇది కూడా విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటించింది.
ఎయిడ్స్ పేషెంట్‌గా సల్మాన్..
‘ఫిర్ మిలేంగే’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ఎయిడ్స్ రోగిగా నటించడం గమనార్హం. ఆ సమయంలో ఏ నటుడు కూడా ఎయిడ్స్ రోగి పాత్రలో నటించడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ సినిమాను చాలా మంది నటులు తిరస్కరించారు. చివరగా సల్మాన్ ఖాన్ ఈ సాహసోపేతమైన పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.
సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఈ మూవీ నిర్మాత శైలేంద్ర సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. "ఈ సినిమాను 30 మంది నటులు తిరస్కరించారు. ఆ తర్వాతే ఈ కథ సల్మాన్ దగ్గరకు చేరింది" అని అతడు చెప్పాడు.
రేవతి దర్శకత్వంలో..
ప్రముఖ నటి రేవతి ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె ఇండస్ట్రీలోని దాదాపు 30 మంది నటులను సంప్రదించారు. ఈ సినిమాను తిరస్కరించిన చివరి నటుడు ఉదయ్ చోప్రా అని నిర్మాత తెలిపాడు. ఎవరూ ఒప్పుకోకపోయేసరికి రేవతి నిరాశ చెంది.. "డబ్బులు వెనక్కి తీసుకోండి, నేను ఈ సినిమాను వదిలేస్తున్నాను" అని నిర్మాతతో అన్నదట. ఆ క్లిష్ట సమయంలో సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.
బాక్సాఫీస్ డిజాస్టర్..
కథ పరంగా ప్రశంసలు దక్కినా, వసూళ్ల పరంగా ‘ఫిర్ మిలేంగే’ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 5.50 కోట్లు కాగా.. వసూళ్లు మాత్రం కేవలం రూ. 3.65 కోట్లు మాత్రమే. బాక్సాఫీస్ ఇండియా నివేదిక ప్రకారం ఈ సినిమా నష్టాలను చవిచూసింది. దీని ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}కథ పరంగా ప్రశంసలు దక్కినా, వసూళ్ల పరంగా ‘ఫిర్ మిలేంగే’ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 5.50 కోట్లు కాగా.. వసూళ్లు మాత్రం కేవలం రూ. 3.65 కోట్లు మాత్రమే. బాక్సాఫీస్ ఇండియా నివేదిక ప్రకారం ఈ సినిమా నష్టాలను చవిచూసింది. దీని ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}