...
...
Next Story

Salman Khan: 'మీ ఆరోగ్యం ఎలా ఉంది?' హెల్త్ రూమర్స్‌పై సల్మాన్ ఖాన్ సెటైరికల్ కౌంటర్.. సల్లూ భాయ్ అంటే అంతే మరి!

Salman Khan: తన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తన కొత్త లుక్స్ పంచుకుంటూ పుకార్లకు చెక్ పెట్టారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Published on: Jul 20, 2026 08:53 AM IST
Advertisement

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఏంటీ ఇలా మారిపోయాడు? అతని హెల్త్ కు ఏమైంది? ముసలోడు అయిపోయాడా?.. ఇవీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సల్మాన్ ఖాన్ వీడియో చూశాక వచ్చిన రియాక్షన్లు. కానీ వీటన్నింటికీ తనదైన స్టైల్లో చెక్ పెడుతూ ఈ బాలీవుడ్ కండల వీరుడు లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

సల్మాన్ ఖాన్ పోస్ట్

'మీ ఆరోగ్యం ఎలా ఉంది?' హెల్త్ రూమర్స్‌పై సల్మాన్ ఖాన్ సెటైరికల్ కౌంటర్.. సల్లూ భాయ్ అంటే అంతే మరి! (x/BeingSalmanKhan)
'మీ ఆరోగ్యం ఎలా ఉంది?' హెల్త్ రూమర్స్‌పై సల్మాన్ ఖాన్ సెటైరికల్ కౌంటర్.. సల్లూ భాయ్ అంటే అంతే మరి! (x/BeingSalmanKhan)

సల్మాన్ ఖాన్ మనసులో ఉన్నది ఏదీ దాచుకోడు. ఏ విషయాన్నైనా ఎంతో సూటిగా, స్పష్టంగా చెప్పడం అతని నైజం. తాజాగా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారానికి తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదివారం (జూలై 20) అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని సరికొత్త బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకున్న సల్మాన్.. దానికి జత చేసిన క్యాప్షన్‌తో అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు.

“మీ ఆరోగ్యం ఎలా ఉంది?”

సల్మాన్ ఈ స్థాయిలో స్పందించడానికి బలమైన కారణమే ఉంది. ఈ వారం మొదట్లో సల్మాన్ ఖాన్ ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆఫీస్‌ను సందర్శించాడు. అక్కడ అత్యాధునిక డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్‌ను (ఐటీ సర్వర్ రూమ్) ప్రారంభించి, లబ్ధిదారులకు కొత్త ఇళ్ల తాళాలను స్వయంగా అందజేశాడు. ఆ కార్యక్రమంలో క్యాప్, క్యాజువల్ షర్ట్ ధరించి పాల్గొన్న సల్మాన్ చాలా సన్నగా, తీవ్ర అలసటతో ఉన్నట్లు కనిపించారు.

వయసైపోతుందా?

ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? మొదట్లో ఆయనను చూసి సల్మాన్ కాదేమో అనుకున్నాను. ధర్మేంద్ర లాగా వయసైపోతున్నట్లు అనిపిస్తోంది" అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేయగా.. "ఈయన నిజంగానే సల్మాన్ ఖానా? ఆరోగ్యం ఏమైనా బాగులేదా?" అని మరొకరు కంగారు పడ్డారు. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ సల్మాన్ ఈ సరదా పోస్ట్ చేశాడు.

'మాతృభూమి' చిత్రంతో

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' విడుదల కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ వార్ డ్రామా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, సినిమాను పక్కన పెట్టలేదని నిర్మాతలు స్పష్టం చేశారు.

అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిత్రంగద సింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe