...
...
Next Story

Salman Khan: నా బెడ్‌రూమ్‌లో దెయ్యం ఉంది.. లైట్లు వెలిగేవి, డోర్లు వాటికవే తెరుచునేవి.. కానీ నేను భయపడలేదు: సల్మాన్ ఖాన్

Salman Khan: సల్మాన్ ఖాన్ షాకింగ్ విషయాలు చెప్పారు. తనతోపాటు తన బెడ్‌రూమ్ లో ఎప్పుడూ ఓ అదృశ్య శక్తి ఉండేదని చెబుతూ.. తాను ఎదుర్కొన్న వింత ఘటనల గురించి వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ షోలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 15, 2026, 16:55:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న మోస్ట్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9)లో సందడి చేశారు. ఈ షోలో భాగంగా సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ చెప్పని కొన్ని ఆసక్తికరమైన, వింత విషయాలను పంచుకున్నారు.

Salman Khan: నా బెడ్‌రూమ్‌లో దెయ్యం ఉంది.. లైట్లు వెలిగేవి, డోర్లు వాటికవే తెరుచునేవి.. కానీ నేను భయపడలేదు: సల్మాన్ ఖాన్ (PTI)
Salman Khan: నా బెడ్‌రూమ్‌లో దెయ్యం ఉంది.. లైట్లు వెలిగేవి, డోర్లు వాటికవే తెరుచునేవి.. కానీ నేను భయపడలేదు: సల్మాన్ ఖాన్ (PTI)

ముఖ్యంగా తాను నివసించే ముంబైలోని ప్రసిద్ధ 'గెలాక్సీ అపార్ట్‌మెంట్' (Galaxy Apartments) బెడ్‌రూమ్‌లో తనకు ఎదురైన వింత అనుభవాల గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సల్మాన్ చెప్పిన ఈ మిస్టరీ స్టోరీ వింటే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. ఆ బెడ్‌రూమ్‌లో అసలు ఏం జరిగిందనే దానిపై సల్మాన్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఆ గదిలో నేను ఎప్పుడూ ఒంటరిగా లేను

ఈ ఎపిసోడ్‌లో కరణ్ జోహార్ తాను బ్లాక్‌బస్టర్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై' (Kuch Kuch Hota Hai) కథ చెప్పడానికి మొదటిసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ తన కుటుంబంతో కలిసి చాలా చిన్న బెడ్‌రూమ్‌లో ఉండేవాడని, అక్కడ ఒక మంచం, ఒక కప్‌బోర్డ్ మాత్రమే ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని కరణ్ తెలిపారు.

అప్పుడు సల్మాన్ స్పందిస్తూ.. "నేను ఆ గదిలో ఎప్పుడూ ఒంటరిగా లేను. ఆ గదిలో నాతో పాటు మరొకరు ఉండేవారు. నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు, కానీ నా వెనుక ఎప్పుడూ ఎవరో ఉన్నట్లు శబ్దం వినిపించేది, ఉనికిని గమనించేవాడిని. నేను ఆ గది నుంచి బయటకు రాగానే లైట్లు వాటంతట అవే ఆన్-ఆఫ్ అయ్యేవి. కప్‌బోర్డ్‌లు వాటంతట అవే తెరుచుకునేవి. మ్యూజిక్ సిస్టమ్ లో మ్యూజిక్ ఆన్ అయ్యేది. నేను బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు కూడా బయట కప్‌బోర్డ్‌లతో ఎవరో ఆడుతున్నట్లు అదృశ్య శక్తి ఉనికిని స్పష్టంగా అనుభవించేవాడిని" అని చెప్పుకొచ్చారు.

అందమైన మహిళ అయితే నాకు కనిపించు అని అడిగాను

ఇదే షోలో కరణ్ జోహార్ 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే సల్మాన్‌కు వినిపించానని, అయినప్పటికీ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ముందే ఊహించి ఆయన ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్, చంద్రచూర్ సింగ్ వంటి నటులు రిజెక్ట్ చేసిన ఆ పాత్ర సల్మాన్ కెరీర్‌లో ఎంత పెద్ద మైలురాయిగా నిలిచిందో తెలిసిందే.

సల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ మూవీస్ లైనప్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న 'మాతృభూమి' (Maatrubhumi) చిత్రంలో ఆయన చిత్రంగదా సింగ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాన్‌స్టార్' (Monster) చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ 2027 (Eid 2027) కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks