Salman Khan Watches: ఒక్కో వాచ్ రూ.6 లక్షలు.. మాతృభూమి మూవీ టీమ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చిన సల్మాన్ ఖాన్

Salman Khan Watches: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ఉదారతను, పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. మాతృభూమి సినిమా ప్రమోషన్స్ గురించి చర్చించాలని తన ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి.. చిత్ర యూనిట్ సభ్యులందరికీ రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల విలువైన ఖరీదైన స్విస్ వాచీలను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

Published on: Nov 17, 2026, 21:11:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Salman Khan Watches: సల్మాన్ ఖాన్ తన మాతృభూమి మూవీ టీమ్ కు ఇచ్చిన లగ్జరీ వాచీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ వార్ డ్రామా మూవీ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే నవంబర్ 10న ముంబైలో ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన సల్మాన్.. ఆ తర్వాత రెండు రోజులకు అంటే నవంబర్ 12న చిత్ర బృందానికి ఒక మరచిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Salman Khan Watches: ఒక్కో వాచ్ రూ.6 లక్షలు.. మాతృభూమి మూవీ టీమ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చిన సల్మాన్ ఖాన్
Salman Khan Watches: ఒక్కో వాచ్ రూ.6 లక్షలు.. మాతృభూమి మూవీ టీమ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చిన సల్మాన్ ఖాన్

ప్రమోషన్ల కోసం అని వెళ్తే..

మాతృభూమి సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలని సల్మాన్ ఖాన్ భావించారు. ఇందుకోసం నవంబర్ 12న తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక గెట్-టుగెదర్ ఏర్పాటు చేశారు.

మొదట చిత్ర బృందానికి సినిమా ప్రమోషనల్ ప్లాన్స్ గురించి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్లాక అది పని మీటింగ్ కాదని, సల్మాన్ ఏర్పాటు చేసిన గ్రాండ్ సెలబ్రేషన్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

ప్రముఖ 'కపూర్ వాచ్ కంపెనీ' నుంచి తెప్పించిన సుమారు 20 నుండి 25 లగ్జరీ వాచీలను సల్మాన్ స్వయంగా తన చేతులతో అందజేశారు. ఒక్కో వాచీ ధర రూ. 2 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. పురుష నటీనటులు, సాంకేతిక నిపుణులకు లాంగైన్స్ (Longines), ట్యాగ్ హ్యూయర్ (TAG Heuer) బ్రాండ్ వాచీలను అందించగా, మహిళా సభ్యులకు ప్రఖ్యాత రాడో (Rado) వాచీలను బహుమతిగా ఇచ్చారు.

పన్వేల్ ఫామ్‌హౌస్ వేడుకలో సందడి చేసిన తారలు వీరే

నవంబర్ 10న ముంబైలో 'మాతృభూమి' ట్రైలర్ లాంచ్ జరిగిన రెండు రోజుల తర్వాత ఈ పార్టీ జరిగింది. సినిమా విడుదలకు ముందు టీమ్ అంతా కలిసి ఆనందంగా గడిపేందుకు ఇది చక్కని వేదికైంది.

ఈ వేడుకలో చిత్ర దర్శకుడు అపూర్వ లాఖియా, కథానాయిక చిత్రాంగద సింగ్, నటులు అంకుర్ భాటియా, విపిన్ భరద్వాజ్, తాన్య దేశాయ్, డైలాగ్ రైటర్ చింతన్ షా తదితరులు పాల్గొన్నారు. సల్మాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన ఆతిథ్యం, ఖరీదైన బహుమతుల ఫోటోలను పలువురు బృంద సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 4న థియేటర్లలోకి ‘మాతృభూమి’

అపూర్వ లాఖియా దర్శకత్వంలో రూపొందిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఒక భావోద్వేగభరితమైన వార్ డ్రామా. షూటింగ్ దశలో, విడుదల తేదీల విషయంలో పలు మార్పులకు లోనైన ఈ చిత్రం, ఎట్టకేలకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

డిసెంబర్ 4న దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. విశేషమేమిటంటే, 2026 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ నుంచి వస్తున్న మొట్టమొదటి థియేట్రికల్ రిలీజ్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తనతో కలిసి పనిచేసే బృందాన్ని ఎప్పుడూ సొంత కుటుంబంలా చూసుకునే సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More