Salman Khan On Ramayana: రాముడు, సీతలపై ఫోకస్ ఉండాలి, 4 వేల కోట్ల బడ్జెట్‌పై కాదు.. రామాయణంపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
Salman Khan About Ramayana: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన రామాయణం సినిమాపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన మాతృభూమి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పందించారు. రూ.4 వేల కోట్ల బడ్జెట్, వీఎఫ్ఎక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టకుండా రామాయణ ఇతిహాసం, రాముడు-సీత-రావణుల పాత్రల విశిష్టతపై ఫోకస్ పెట్టాలన్నారు.
Salman Khan About Ramayanam In Maatrubhumi Trailer Launch: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రామాయణ పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై, దాని నిర్మాణ వ్యయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు.

మాతృభూమి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో
తన రాబోయే చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో విలేకరులు రామాయణం చిత్రం గురించి ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బడ్జెట్, వీఎఫ్ఎక్స్ గురించే మాట్లాడుతున్నారు
"రామాయణం అనగానే కేవలం రూ.4,000 కోట్ల బడ్జెట్, వీఎఫ్ఎక్స్ (VFX) హంగామా గురించే మాట్లాడటం సరికాదు. ఆ శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుల పాత్రల (రాముడు, సీత, రావణాసూరుడు పాత్రలపై ఫోకస్ పెట్టాలి) విశిష్టతపై, రామాయణ మూలాల ఆధారంగా కథ చెప్పే విధానంపైనే ప్రధానంగా చర్చ సాగాలి" అని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
మాతృభూమిలో కూడా అవే లక్షణాలు కనిపిస్తాయి
రాముడు ఉత్తమ కొడుకుగా, మంచి భర్తగా, బాధ్యతాయుతమైన తండ్రిగా, వీరుడైన యోధుడిగా నిలిచారని.. తన 'మాతృభూమి' చిత్రంలోని కథానాయకుడి పాత్రలో కూడా అవే లక్షణాలు కనిపిస్తాయని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్' సునామీ
నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న రామాయణం చిత్రం విజువల్‌గా అద్భుతంగా అలరిస్తోంది. మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు.
రామాయణం కలెక్షన్స్
విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రామాయణ పార్ట్ 1 చిత్రం భారతదేశంలో రూ.100 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రంలో రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
డిసెంబర్ 4న సల్మాన్ 'మాతృభూమి'
మరోవైపు సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'మాతృభూమి' చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రాంగద సింగ్, ముకేష్ రిషి తదితరులు నటించిన ఈ చిత్రంపై కూడా సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
గ్రాఫిక్స్ ఎంత పెరిగినా
సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్ ఎంత పెరిగినా రామాయణం కథలోని ఆత్మ, భారతీయ సంస్కృతిలోని మూలాలే ప్రధానమని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


