Rashmika Salman: రష్మిక మందన్నాను ఆటపట్టించిన సల్మాన్ ఖాన్- డబ్బుకోసమే నంటూ సైగలు- బెదిరింపులు, భారీ సెక్యురిటీ నడుమ!

Salman Khan Satires On Rashmika Mandanna Varun Dhawan: ముంబైలో జరిగిన ఐఫా (IIFA) 2027 ముందస్తు కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సందడి చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు, టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పుల ఘటనల వేళ అత్యంత భారీ భద్రత మధ్య విచ్చేసిన ఆయన, వేదికపై రష్మిక, వరుణ్‌కో ఎంతో సరదాగా గడిపారు.

Published on: Oct 23, 2026, 16:10:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Salman Khan Satires On Rashmika Mandanna Varun Dhawan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర ప్రాణహాని ముప్పు పొంచి ఉన్నప్పటికీ, బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన మార్క్ స్టైల్‌ను వీడలేదు. ముంబైలో గురువారం (అక్టోబర్ 22) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన ఐఫా (IIFA) 2027 అవార్డుల ముందస్తు కార్యక్రమంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

రష్మిక మందన్నాను ఆటపట్టించిన సల్మాన్ ఖాన్- డబ్బుకోసమే నంటూ సైగలు- బెదిరింపులు, భారీ సెక్యురిటీ నడుమ!
రష్మిక మందన్నాను ఆటపట్టించిన సల్మాన్ ఖాన్- డబ్బుకోసమే నంటూ సైగలు- బెదిరింపులు, భారీ సెక్యురిటీ నడుమ!

భారీ భద్రతా నడుమ

చుట్టూ భారీ భద్రతా బలగాలు పహారా కాస్తున్నప్పటికీ, ఏమాత్రం బెరుకు లేకుండా వేదికపై ఇతర సినీ ప్రముఖులతో ఎంతో సరదాగా గడిపారు సల్మాన్ ఖాన్. ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, వరుణ్ ధావన్, కరీనా కపూర్, షాహిద్ కపూర్ వంటి అగ్రతారలు పాల్గొన్నారు.

రష్మికను ఆటపట్టించిన సల్మాన్

వచ్చే ఏడాది జరగబోయే ఐఫా వేడుకల్లో తాను మొదటిసారి ప్రదర్శన ఇవ్వబోతున్నానని హీరోయిన్ రష్మిక మందన్నా ఎంతో ఉత్సాహంగా చెప్పారు. "ఇది ఐఫాలో నా తొలి పెర్ఫార్మెన్స్, చాలా ఉత్సాహంగా ఉంది" అని రష్మిక చెబుతుండగా సల్మాన్ వెంటనే స్పందిస్తూ చేతులతో డబ్బుల సైగలు చేశారు.

"ఎక్కువ పారితోషికం ఇస్తున్నారనే కదా అంత ఉత్సాహం" అని రష్మికను ఆటపట్టించారు సల్లూ భాయ్. రష్మిక నవ్వుతూ "కాదు, పెర్ఫార్మెన్స్ చేయడం కోసమే" అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా, సల్మాన్ వదలకుండా నవ్వులు పూయించారు.

సికందర్ సినిమా వల్లే

'సికందర్' సినిమా ప్రాజెక్టు వల్లనే రష్మికను ఐఫా స్టేజ్ మీదికి తీసుకురావడానికి ఇంత సమయం పట్టిందని వ్యాఖ్యానించారు. సల్మాన్ వేసిన ఈ పంచ్‌లకు వేదికపై ఉన్న కరీనా కపూర్, షాహిద్ కపూర్ పెద్దగా నవ్వేశారు.

వరుణ్ ధావన్‌కు వింత సలహా

తొలిసారిగా ఐఫా అవార్డుల రాత్రికి వ్యాఖ్యాతగా (హోస్ట్) వ్యవహరిస్తున్న వరుణ్ ధావన్‌కు సల్మాన్ ఖాన్ ఒక విచిత్రమైన సలహా ఇచ్చారు. మీడియా ప్రతినిధులు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు, "అసలు యాంకరింగ్ చేయడమే దండగ. ఆరు గంటల సమయం వృథా అవుతుంది. దానికంటే ప్రశాంతంగా నా దగ్గరికొచ్చి ఇలా డ్యాన్స్ చేసి వెళ్లిపో. ఆ హోస్టింగ్ పని ఏదో నిపుణులకు వదిలేయ్" అని తనదైన శైలిలో కామెంట్ చేశారు.

తీవ్ర భద్రత నడుమ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ ఘటనతో ఆందోళన

అనంతరం వరుణ్‌తో కలిసి వేదికపైనే చిన్నపాటి స్టెప్పులేసి అలరించారు సల్మాన్ ఖాన్. ఇదిలా ఉంటే, అక్టోబర్ 19న ముంబైలోని యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముగ్గురు దుండగులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో టైగర్ డ్రైవర్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి.

ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుడు సోషల్ మీడియాలో ప్రకటించాడు. సల్మాన్ ఖాన్‌తో టైగర్ ష్రాఫ్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంతోనే ఈ దాడి చేసినట్లు వారు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పదిమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ "శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదు" అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

'బిగ్ బాస్ 20'కి సల్మాన్ బ్రేక్

ఈ భద్రతా కారణాలు, ముందస్తుగా ఒప్పుకున్న ఇతర షూటింగ్‌ల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ 20' వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌కు ఈ వారం దూరంగా ఉండనున్నారు. "ముందస్తు కట్టుబాట్ల వల్ల వచ్చే వారం మిమ్మల్ని కలవలేను. నా స్థానంలో దర్శకుడు రోహిత్ శెట్టి వీకెండ్ కా వార్‌ను నడిపిస్తారు" అని సల్మాన్ ఇదివరకే చెప్పారు.

ఒకవైపు ప్రాణహాని బెదిరింపులు ఉన్నప్పటికీ, వృత్తిపరమైన బాధ్యతల్లో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్న సల్మాన్ ధైర్యాన్ని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More