భర్త మాజీ లవర్ టాక్ షోకి గెస్టుగా స్టార్ హీరో భార్య- కరీనా కపూర్, మీరా రాజ్‌పుత్ దేనిగురించి మాట్లాడుకున్నారో తెలుసా?

Mira Rajput Guest To Kareena Kapoor Talk Show: బాలీవుడ్‌లో ప్రేమాయణాలు సాధారణమే. అయితే, తాజాగా తన భర్త మాజీ లవర్ నిర్వహించే ఓటీటీ టాక్ షోలో స్టార్ హీరో భార్య పాల్గొని మాట్లాడటం ఆసక్తిగా మారింది. మరి షాహిద్ కపూర్ మాజీ ప్రేయసి కరీనా కపూర్, భార్య మీరా రాజ్‌పుత్ దేని గురించి మాట్లాడుకున్నారో చూద్దాం.

Published on: Oct 31, 2026, 06:35:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mira Rajput Guest To Kareena Kapoor Talk Show: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2015లో కేవలం 21 ఏళ్ల వయసులోనే షాహిద్‌ను పెళ్లాడిన మీరా, 2016లో కుమార్తె మీషాకు జన్మనిచ్చారు.

భర్త మాజీ లవర్ టాక్ షోకి గెస్టుగా స్టార్ హీరో భార్య- కరీనా కపూర్, మీరా రాజ్‌పుత్ దేనిగురించి మాట్లాడుకున్నారో తెలుసా?
భర్త మాజీ లవర్ టాక్ షోకి గెస్టుగా స్టార్ హీరో భార్య- కరీనా కపూర్, మీరా రాజ్‌పుత్ దేనిగురించి మాట్లాడుకున్నారో తెలుసా?

కరీనా కపూర్ టాక్ షో

తాజాగా స్టార్ హీరోయిన్, బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ నిర్వహిస్తున్న ప్రముఖ చాట్ షో 'వాట్ ఉమెన్ వాంట్' (What Women Want) సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొన్న మీరా రాజ్‌పుత్ చిన్న వయసులోనే మాతృత్వాన్ని పొందడంపై మనసు విప్పి మాట్లాడారు.

మాతృత్వం ఒక పెద్ద బాధ్యత

ఏ వయసులో తల్లి అయినా పిల్లలను పెంచడం ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పనని మీరా రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు. కరీనా కపూర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "మాతృత్వం ఏ వయసులో వచ్చినా అది సవాలే. మీరు, నేను వేర్వేరు వయసుల్లో తల్లులమయ్యాం. కానీ ఇద్దరం ఆ సమయానుకూల సవాళ్లను ఎదుర్కొన్నాం" అని మీరా పేర్కొన్నారు. చిన్నతనంలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎదురైన అనుభవాలను ఆమె వివరించారు.

భర్త షాహిద్, అక్కల అండ

ఆరంభంలో పిల్లల పెంపకంపై ఏ పుస్తకమూ చదవలేదని, కుటుంబ సభ్యుల అనుభవాలే తనకు పాఠాలుగా మారాయని మీరా తెలిపారు. "ఆ సమయంలో నాకు భర్త షాహిద్ పూర్తి అండగా నిలిచారు. అప్పటికే పిల్లలున్న నా ఇద్దరు అక్కలను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఏ పుస్తకం చదవాల్సిన అవసరం రాలేదు. కొద్దిగా కష్టంగా అనిపించినా, ఈ ప్రయాణాన్ని నేను వేరే విధంగా ఊహించుకోలేను" అని మీరా రాజ్‌పుత్ వెల్లడించారు.

పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండటం తనకెంతో ఇష్టమని మీరా చెప్పారు. "నా కూతురు మీషాకు 21 ఏళ్లు వచ్చేసరికి నాకు 41 ఏళ్లు వస్తాయి. వారి ఆలోచనలను సులువుగా అర్థం చేసుకునే వయసులోనే నేను ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తోంది" అని మీరా హర్షం వ్యక్తం చేశారు.

ఒకే ఫ్రేమ్‌లో కరీనా - మీరా

ఒకే ఆధ్యాత్మిక మార్గాన్ని (రాధా సోమి సత్సంగ్) అనుసరిస్తున్న క్రమంలో 2015లో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి మీషా, జైన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, మీరా ఇటీవల 'టిరా బ్యూటీ'తో కలిసి 'అకైండ్ బ్యూటీ' అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

ఈ షోను హోస్ట్ చేసిన కరీనా కపూర్ గతంలో (2004-2007) షాహిద్ కపూర్‌తో డేటింగ్ చేశారు. అప్పట్లో బాలీవుడ్ సినీ వర్గాల్లో షాహిద్, కరీనా ప్రేమాయణం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆ తర్వాత 2012లో పటౌడీ నవాబు, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్‌ను కరీనా వివాహం చేసుకున్నారు.

పాత విషయాలను పక్కనపెట్టి

పాత విషయాలను పక్కనపెట్టి మీరా రాజ్‌పుత్ ఈ ఓటీటీ షోకి విచ్చేసి ముచ్చటించడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇక కరీనా విషయానికి వస్తే, ఆమె ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలసి 'దాయరా' (Daayra) అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు.

ఒకవైపు వృత్తిపరమైన బాధ్యతలు, మరోవైపు కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ మీరా రాజ్‌పుత్ సాగిస్తున్న పయనం నేటి తరం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 21 ఏళ్లకే బాధ్యతలు స్వీకరించి, విజయవంతంగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More